దుస్తులకు బబుల్ గమ్ అతుక్కుపోయిందా.? ఇలా చేస్తే సింపుల్‌గా వదులుతుంది
బబుల్ గమ్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడేవాటిలో ఇది ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా బబుల్ గమ్‌ను తింటుంటారు. అయితే బబుల్ గమ్‌తో లాభాలు ఉంటాయని, అదే విధంగా నష్టాలు కూడా ఉంటాయనే వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా బబుల్‌గమ్‌ను తినేవారే ఎక్కువ అని చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో బబుల్‌గమ్ పొరపాటున దుస్తులకు అతుక్కుపోతుంది. ఇలా అతుక్కుపోయిన బబుల్ గమ్‌ను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బబుల్ గమ్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడేవాటిలో ఇది ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా బబుల్ గమ్‌ను తింటుంటారు. అయితే బబుల్ గమ్‌తో లాభాలు ఉంటాయని, అదే విధంగా నష్టాలు కూడా ఉంటాయనే వాదనలు ఉన్నాయి. ఏది ఏమైనా బబుల్‌గమ్‌ను తినేవారే ఎక్కువ అని చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో బబుల్‌గమ్ పొరపాటున దుస్తులకు అతుక్కుపోతుంది. ఇలా అతుక్కుపోయిన బబుల్ గమ్‌ను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కొందరు స్టైల్ కోసం మరికొందరు మౌత్ ఫ్రెషనర్‌గానో బబుల్ గమ్‌ను తింటుంటారు. అయితే చూయింగ్ గమ్‌ను నమిలి ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా రోడ్లపై నమిలి పడేసిన చూయింగ్ గమ్‌ను చిన్న చిన్న పక్షుల్లాంటి మూగ జీవులు తింటుంటాయి. ఇవి వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే కేవలం ఇదే కాకుండా సాటి మనుషులు కూడా వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిని పడేసిన చూయింగ్ గమ్‌లను తొక్కడం వల్ల చెప్పులకు అతుక్కుపోతాయి.
డ్రస్‌లకు కూడా..
ఇక కొందరు కొంటె స్వభావం ఉన్న వారు చూయింగ్ గమ్‌లను టేబుల్లకు, కుర్చీలకు, బస్సుల్లో సీట్లకు అతికిస్తుంటారు. అయితే వీటిని గమనించకుండా కూర్చుంటే చూయింగ్ గమ్ దుస్తులకు అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కసారిగా అతుక్కున్న చూయింగ్ గమ్ తొలగిపోవడం అంత సులభమైన విషయం కాదు. ఎంత కష్టపడి ఉతికినా చూయింగ్ గమ్ సులభంగా తొలగిపోదు. దీంతో ధరించిన దుస్తులు అందవిహీనంగా కనిపిస్తుంటాయి. అయితే దుస్తులకు అతుక్కుపోయిన చూయింగ్ గమ్‌లను తొలిగించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఐరన్ చేయడం
ఐరన్ బాక్స్‌ను ఉపయోగించి దుస్తులకు అతుక్కుపోయిన చూయింగమ్‌ను తొలగించవచ్చు. ఇందుకోసం ముందుగా ఐరన్ బాక్స్‌ను హీట్ చేయాలి. ఆ తర్వాత చూయింగ్ గమ్ అతుక్కున్న చోట వెనకాల వైపు ఐరన్ బాక్స్‌ను పెట్టాలి. ఇలా కాసేపు పెడితే చూయింగ్ గమ్ కాస్త కరుగుతుంది. వెంటనే డ్రస్‌ను రివర్స్ చేసి చేత్తో లాగేస్తే చూయింగ్ గమ్ సింపుల్‌గా వచ్చేస్తుంది.
వెనిగర్‌తో..
దుస్తులకు అంటిన చూయింగ్ గమ్‌ను తొలగించేందుకు ముందుగా ఒక గిన్నెలో వెనిగర్‌ను తీసుకోవాలి. అనంతరం వెనిగర్‌ను కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత చూయింగమ్ అంటుకున్న ప్రదేశాన్ని వెనిగర్‌లో ఉంచాలి. ఇలా రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత టూత్‌బ్రష్‌తో రుద్దితో చాలు చూయింగ్ గమ్ ఊడిపోతుంది.
రబ్బింగ్ ఆల్కహాల్‌తో..
స్పాంజ్‌పై కొంత రబ్బింగ్ ఆల్కహాల్‌ను పోయాలి. అనంతరం స్పాంజ్‌ను చూయింగమ్ ఉన్న చోట రుద్దాలి. రబ్బింగ్ ఆల్కహాల్ చూయింగ్ గమ్‌తో పాటు దుస్తులకు అంటుకునేలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్‌తో తీసేస్తే చూయింగ్ గమ్ తొలగిపోతుంది.
హెయిర్ డ్రయర్
హెయిర్ డ్రయర్‌ను ఆన్ చేసి చూయింగ్ గమ్ అతుక్కున్న చోట కాసేపు అలాగే పెట్టాలి. అనంతరం దానిపై కొద్ది కొద్దిగా నీటి చుక్కలను వేస్తుండాలి. ఇలా కాసేపు చేస్తే తర్వాత చేత్తో పీకేసిన సులభంగా చూయింగ్ గమ్ వచ్చేసింది. ముఖ్యంగా ఎండిపోయిన చూయింగ్ గమ్ సులువుగా దుస్తుల నుంచి విడిపోతుంది.