Asianet News TeluguAsianet News Telugu

నిద్రలేకుండా మనం బతికేది ఇన్ని రోజులేనా..?

నిద్రతోనే సగం రోగం నయమవుతుందంటారు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు. అందుకే పాణం మంచిగ లేనప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇంతకీ మనం ఎన్ని రోజులు నిద్ర లేకుండా జీవిస్తామో ఎంత మందికి తెలుసు..? 
 

how many days a human survive without sleep
Author
Hyderabad, First Published Jun 26, 2022, 1:39 PM IST

మనిషికి ఆహారం (Food), నీరు (Water), గాలి (Air)ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. మానవ శరీరంలోని ప్రతి భాగానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. మనం బతకనీకె  ఆక్సిజన్, ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలలో దీనిని పదేపదే నొక్కి చెప్పారు కూడా. 

మానవ శరీరానికి అవసరమైన శక్తిని తిరిగి నింపడానికి పట్టే సమయాన్ని నిద్ర అంటారు. రాత్రిపూట నిద్రపోయిన వారు మరుసటి రోజు ఉదయం మేల్కొన్నప్పుడు తాజాగా ఉంటారు. నిద్ర శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. విశ్రాంతినిస్తుంది. కానీ  ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యలు ఎక్కువయ్యాయి. తెల్లవార్లూ సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తూ.. బంగారం లాంటి నిద్రను పాడు చేసుకుంటున్నారు. కానీ ఈ నిద్రలేమి (Insomnia) సమస్య మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే  శరీరంపై చెడు ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సాధారణంగా ఒక వ్యక్తి 6 నుంచి8 గంటల వరకు నిద్రపోతాడు. మరి మొత్తానికే నిద్రపోకపోతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దాని వల్ల అతని శరీరంలో ఏ విధమైన మార్పులు వస్తాయన్న అనుమానాలు వస్తాయి కదూ.. అయితే మనం తినకపోయినా లేదా తాగకపోయినా శరీరం ఎక్కువ రోజులు బతకదు. అలాగే శరీరానికి నిద్ర లేకుండా కూడా శరీరం ఎక్కువ రోజులు ఉండలేదు.  కాబట్టి నిద్రపోవడం, తినడం, త్రాగడం వంటివి జీవితంలో ముఖ్యమైన కార్యకలాపాలు.

రోజువారీ కార్యకలాపాల కారణంగా నిద్ర పరిమాణం , నాణ్యత తగ్గినప్పుడు.. అది ఒక వ్యక్తి  ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. క్రమంగా ఇది నిద్రలేమి కి కారణమవుతుంది. ఇది ఒక సాధారణ నిద్ర రుగ్మత. కానీ ఒక వ్యక్తి వరుసగా పదకొండు రోజులు నిద్రపోకపోతే అతను మరణించే అవకాశం ఉందని ఇప్పుడు పరిశోధనలో వెల్లడైంది. ఒక వ్యక్తి నిద్ర లేకుండా కేవలం 11 రోజులు మాత్రమే జీవించగలడని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు.

హార్వర్డ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్రలేమి నేరుగా Gut, మెదడును ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా శరీరానికి కొంత Systemic damage అయ్యి మరణం సంభవించవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో మూడింట ఒక వంతు నిద్రలోనే గడుపుతాడు. అ౦తేకాక మన౦ స౦తోష౦గా ఉన్నా, ఉత్సాహ౦గా ఉన్నా.. ఎ౦త ప్రయత్ని౦చినా నిద్రరాదన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అదనంగా రోజుకు ఏడు గంటల పాటు క్రమం తప్పకుండా నిద్రపోయే వారిలో 30% మందికి జలుబు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఏదేమైనా నిద్ర లేకుండా మనం జీవించలేమన్నది నిజం.


 

Follow Us:
Download App:
  • android
  • ios