Asianet News TeluguAsianet News Telugu

మంచిది కదా అని మంచినీరు ఎక్కువగా తాగితే...

మంచినీరు తాగడం మంచిదని వైద్యులు, నిపుణులు, పెద్దలు తరచూ చెబుతుంటారు. శరీరానికి తగినంత నీరు లభించకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి రోజుకి కనీసం రెండు లీటర్ల మంచినీరు అయినా తాగాలని చెబుతుంటారు. 

Here's Why You Shouldn't Drink Heavy Water
Author
Hyderabad, First Published Jun 29, 2019, 1:31 PM IST

మంచినీరు తాగడం మంచిదని వైద్యులు, నిపుణులు, పెద్దలు తరచూ చెబుతుంటారు. శరీరానికి తగినంత నీరు లభించకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి రోజుకి కనీసం రెండు లీటర్ల మంచినీరు అయినా తాగాలని చెబుతుంటారు. అయితే... తాగమన్నారు కదా... శరీరానికి మంచిది కదా అని లీటర్లకు లీటర్లు నీరు తాగితే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అతి తాగితే మంచినీరు కూడా అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై తాజాగా ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది.

 వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు. అనంతరం వారి ఎంఆర్ఐ తీసి చూడగా... అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి వారు ఏదైనా తినాలన్నా..నమలడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
 
ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని కణాలు వాస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా పోవచ్చు. అందుకే మనిషి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని వారు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios