ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు జూన్ 14న ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోని వాళ్ళు ఆధార్ కేంద్రంలో డబ్బులు కట్టి అప్‌డేట్ చేసుకోవాలి.
ఆధార్ కార్డ్ అప్ డేట్ అవసరమైనవారికి ఇదే మంచి ఛాయిస్. మరో నాలుగురోజులు అంటే జూన్ 14 వరకు మీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఉచితంగానే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా అప్‌డేట్ చేసుకుంటే మాత్రం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్లి 50 రూపాయలు ఫీజు కట్టాలి. కాబట్టి ఈ నాలుగు రోజుల్లోపు మీ ఆధార్ ను అప్ డేట్ చేసుకొండి.
యుఐడిఎఐ నిబంధనల ప్రకారం, ఆధార్ కార్డ్ ఉన్నవాళ్ళు తమ రికార్డులు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఐడెంటిటీ ప్రూఫ్ (POI), అడ్రస్ ప్రూఫ్ (POA) అప్‌డేట్ చేయాలి.
ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
1. యుఐడిఎఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మై ఆధార్ పోర్టల్‌లోకి వెళ్ళండి.
2. మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ వాడి లాగిన్ అవ్వండి.
3. మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది.
4. లాగిన్ అయ్యాక, మీ ప్రస్తుత ఐడెంటిటీ ప్రూఫ్ (PoI), అడ్రస్ ప్రూఫ్ (PoA) రికార్డులు చెక్ చేసుకోండి.
5. మీరు వాటిని అప్‌డేట్ చేయాలనుకుంటే, 'డాక్యుమెంట్ అప్‌డేట్' మీద క్లిక్ చేయండి.
6. మెనూలో నుంచి మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్‌లను ఎంచుకుని, క్లియర్‌గా స్కాన్ చేసిన కాపీలు అప్‌లోడ్ చేయండి.
7. ఫైల్స్ JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో ఉండి, 2MB కంటే తక్కువ సైజులో ఉండేలా చూసుకోండి.
8. మీ వివరాలు రివ్యూ చేసుకుని, అప్‌డేట్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి. మీ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) నోట్ చేసుకోండి.
ఏ డాక్యుమెంట్‌లు సబ్మిట్ చేయాలి?
ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్: రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ, ప్రభుత్వం ఇచ్చిన అడ్రస్ ఉన్న ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్
ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే: పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ మార్క్స్ మెమో లేదా ఫోటో ఉన్న లీవింగ్ సర్టిఫికెట్, అడ్రస్ లేని ప్రభుత్వ ఐడీ.
అడ్రస్ ప్రూఫ్: గత మూడు నెలల కరెంట్ బిల్లు, నీళ్ల బిల్లు లేదా గ్యాస్ బిల్లు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, అద్దె/లీజు ఒప్పందం.
డాక్యుమెంట్‌లు ఎలా, ఏ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయాలి?
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేయండి లేదా ఆధార్ కేంద్రానికి వెళ్ళండి.
ఆమోదించే ఫైల్ ఫార్మాట్‌లు: JPEG, PNG, PDF (గరిష్ట సైజు ఒక్కోదానికి 2MB).
బయోమెట్రిక్ అప్‌డేట్స్ (ఫోటో, వేలిముద్రలు) కోసం, మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కి వెళ్లాలి.
గడువు దాటితే ఏమవుతుంది?
జూన్ 14 తర్వాత, అన్ని డాక్యుమెంట్ అప్‌డేట్‌లను ఆధార్ సెంటర్‌లో ఆఫ్‌లైన్‌లో చేయాలి, దానికి ఫీజు కట్టాలి. అప్‌డేట్ చేయకపోతే ఆధార్ అవసరమయ్యే సర్వీసుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో ఇబ్బందులు, ఖర్చులు రాకుండా ఉండాలంటే జూన్ 14 లోపు ఉచిత ఆన్‌లైన్ అప్‌డేట్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాం.