Asianet News TeluguAsianet News Telugu

Alcohol : మందు తాగితే నిద్ర బాగా వస్తుందనడంలో ఉన్న నిజమెంతో తెలుసా?

Alcohol : అది తాగితేనే నేను ప్రశాంతంగా నిద్రపోగలను అంటూ చాలా మంది మద్యానికి బాగా అలవాటు పడిపోయారు. అదేంటి అంటే అలసిన శరీరానికి నిద్ర రావడం అంటే కష్టం. అందుకే మందు తాగుతున్నామని చెబుతుంటారు. నిజంగా మందు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందా..? ఇందులో ఉన్న నిజమెంత..? 
 

does drinking alcohol help you sleep comfortably which of the following is true
Author
Hyderabad, First Published Jan 21, 2022, 12:54 PM IST

Alcohol : పండగలు, పబ్బాలు అంటూ సందర్భం ఎలాంటిదైనా.. మందును సేవించడమే పనిగా పెట్టుకున్న వారు నేడు చాలా మందే ఉన్నారు. అందులోనూ స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగే వారు అదే పనిగా అలవాటుగా చేసుకుని నిత్యం తాగుతూ మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కానీ లిమిట్ కు మించి ఆల్కహాల్ సేవిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మితంగా తీసుకుంటే శరీరం ఉత్సాహంగా మారుతుంది. అలాగే మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్, డోపమైన్ హార్మోన్లు ఉత్పత్తి అవడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. శరీరానికి తీసుకునే ఇతర పదార్థాల కంటే ఆల్కహాలే చాలా తొందరగా శరీరంపై ఎఫెక్ట్ ను చూపిస్తుందట. ఈ ఆల్కహాల్ ముందుగా జీర్ణాశయానికి వెళుతుంది. అక్కడి నుంచి నేరుగా రక్తంలో కలిసిపోయి, మెదడు, కాలేయానికి చేరుకుని అటు నుంచి ఇతర భాగాలకు వెలుతుంది. 

అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే నిద్రలేమితో బాధపడేవారే రాత్రి టైంలో ఆల్కహాల్ సేవిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్న వారు కొందరు నిద్రమాత్రలు వేసుకుంటే, మరికొందరు ఆల్కహాల్ సేవిస్తున్నారు. నిజానికి మద్యం సేవించడం వల్ల నిద్ర ప్రశాంతంగా పడుతుందని అనడం ఒక అపోహ మాత్రమే. దీన్ని రాత్రి పూట అలవాటు చేసుకోవడం వల్ల వారి నిద్ర టైం వేస్ట్ కావడమే కాకుండా నిద్రలేమి సమస్యను కూడా తెస్తుందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అయితే మద్యం సేవించడం వల్ల మత్తుకు కొన్ని గంటల వరకు నిద్ర బాగానే వస్తుందట. ఆ తర్వాత పూర్తిగా నిద్రరాదని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఈ సమస్యలు మగవారిలో కంటే మహిళల్లోనే అధికంగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మిచిగాన్ విశ్వవిద్యాలయం దీనిపై పరిశోధన చేసింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. 

ఈ పరిశోధనలో 20 ఏండ్ల యవతను తీసుకుని వారికి ఫస్ట్ రోజు మద్యం కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చారు. తర్వాతి రోజు కేవలం వాసన రావడానికే కూల్ డ్రింక్స్ లో ఆల్కహాల్ కలిపారు. ఆ తర్వాత వారిని పరిశీలిస్తే.. మద్యం తాగిన రోజు వారు తొందరగా నిద్రలోకి జారుకున్నప్పటికీ.. కొద్ది సేపటికే మేల్కొన్నారు. ఆ తర్వాత ఎంత సేపటికి కూడా నిద్ర పట్టక అటు ఇటు మసలడాన్ని వారు గమనించారు. దీని వల్ల తెలిసిందేంటంటే మద్యం సేవిస్తే నిద్ర ప్రశాంతం గా పడుతుందనేది పూర్తిగా మన అపోహ అని మాత్రమేనని నిపుణులు అంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలెయం దెబ్బతింటుంది. తద్వార కాలెయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు ఆల్కహాల్ సేవించడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు పెరుగుతాయి. దాంతో పేగుల్లో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ ఆకలి లేకుండా చేస్తుంది. అలాగే కిడ్నీల డ్యామేజ్ కు దారితీస్తుంది. వీటితో పాటుగా పక్షవాతం, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios