దీర్థకాలిక నొప్పులతో బాధపడేవారు పారాసెటమాల్ ట్యాబ్లెట్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పారాసెటమాల్ టాబ్లెట్ వల్ల అధిక రక్త పోటు పెరుగుతుంది. తద్వారా హాట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పారాసెటమాల్ టాబ్లెట్ వాడకం బాగా పెరిగింది. తలనొప్పికి, జ్వరానికి, కీళ్ల నొప్పులకు, చెవినొప్పి వంటి సమస్యల నివారణకు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వినియోగం చాలా వరకు పెరిగింది. అయితే రెండు వారాల పాటు పారాసెటమాల్ ను ఉపయోగించడం వల్ల అధిక రక్త పోటు సమస్య బారిన పడే ప్రమాదముందని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లినికల్ ఫార్మకాలజీ చైర్ ప్రొఫెసర్ జేమ్స్ డియర్ అన్నారు. అంతేకాదు ఈ అధిక రక్తపోటు తో పాటుగా ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులతో పాటుగా గుండె నొప్పి వచ్చే అవకాశాలున్నాయని ప్రోఫెసర్ జేమ్స్ డియర్ పేర్కొంటున్నారు.
ఈ అధ్యయనం ప్రకారం.. పారాసెటమాల్ ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల గుండెపోటుతో పాటుగా పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమస్యలున్న వారికి పారాసెటమాల్ టాబ్లెట్ ను ఇవ్వకూడదని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్న 110 మంది రోగులను ఈ అధ్యయనం కోసం యూనివర్సిటీ ఆఫ్ ఎడినన్ బర్గ్ నిపుణులు ఎంచుకున్నారు. వీరికి రోజుకు ఒక గ్రాము పారాసెటమాల్ చొప్పున నాలుగు సార్లు ఇచ్చి వారిని ప్లేసిబోలో ఉంచారు. కాగా వీరికి నాలుగు రోజుల్లో రక్తపోటు చాలా వరకు పెరిగిందని తేలింది. అంతేకాదు వీరిలో 20 శాతం గుండె పోటు వచ్చే అవకాశం పెరిగినట్టుగా వెళ్లడించారు.
కాగా యూకేలో ప్రతి పది మంది దీర్ఘకాలిక నొప్పుల నివారణకు ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను సూచిస్తున్నారట. దాంతో ముగ్గురు ఒక్కరు అధిక రక్తపోటు బారిన పడుతున్నారని తేలింది. Therapeutics and Clinical Pharmacology at the University of Edinburgh ప్రొఫ్రెసర్ డేవిడ్ వెబ్ మాట్లాడుతూ.. అధిక రక్తపోటును పెంచే ఇబుప్రోఫెన్ వంటి మెడిసిన్స్ ను వాడకూడదని మేం.. చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే వీటికి ప్రత్నామ్నాయంగా పారాసెటమాల్ ఎంతో సురక్షితమని భావించాం. అయితే వీరిలో గుండెపోటు లేదా పక్షవారం వచ్చే ప్రమాదం పొంచి ఉన్న రోగులు ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను ఉపయోగించకూడదని ఆయన తెలుపుతున్నారు.
రోగులకు తక్కువ మోతాదులో ఉండే పారాసెటమాల్ టాబ్లెట్లను ఇవ్వాలని సూచించాం. ముఖ్యంగా రోగం తీవ్రతను బట్టి ఆ మోతాదును పెంచాలనీ వైద్యులకు సూచిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగని నొప్పిఅధికంగా ఉందని అవసరమైన మోతాదుకంటే ఎక్కువ అస్సలు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక నొప్పులకు ఈ పారాసెటమాల్ ను అధిక రక్తపోటున్న వారు మొదటగా ఉపయోగించడం వల్ల కాస్త ప్రయోజనం కలగవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా అధిక రక్తపోటున్న వారిలో ప్రతి ముగ్గురు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనం పేర్కొంటోంది. అయితే ఈ రక్తపోటున్న చాలా మంది రోగులు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వాడుతున్నారు. కాగా ఈ ట్యాబ్లెట్ వీరిలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. Consultant in Clinical Pharmacology and Nephrology at NHS Lothian డాక్లర్ ఇయాన్ మాక్ ఇంటైర్ ఇలా మాట్లాడారు.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను తరచుగా కాకుండా అప్పుడప్పుడు వాడే వారు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిని జ్వరం, తలనొప్పి వంటి సమస్యలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. కానీ క్రమం తప్పకుండా దీర్థకాలం పాటు తీసుకుంటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారవుతారని ఆయన భావిస్తున్నారు.
