మీరెప్పుడూ వినని కరోనా కొత్త లక్షణాలు.. వీటిని సకాలంలో గుర్తించకపోతే.. మీ పని అంతే.. !
కరోనా (corona)మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ రాకతో.. కోవిడ్ లక్షణాలు (symptoms) కూడా బయటకు వచ్చాయి. ఇవి కూడా కరోనా లక్షణాలేనా అని ఆశ్చర్యపోతారేమో.
కరోనా వైరస్ నుంచి మనం పూర్తిగా బయటపడే రోజులు ఇప్పట్లో లేవనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి పోతే ఇంకోటన్నట్టు.. ఈ మహమ్మారి రోజు రోజుకు కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటోంది. లక్షల మంది ప్రాణాలను తీసిన కరోనా.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక కొత్త వేరియంట్లతో పాటుగా ఈ వ్యాధి కొత్త లక్షణాలు కూడా పుట్టుకొస్తున్నాయి.
మొదట్లో కరోనా లక్షణాలు: జ్వరం (Fever), దగ్గు (Cough), గొంతునొప్పి (Sore throat), వాసన లేదా రుచి తెలియకపోవడం. దీని తరువాత తలనొప్పి (Headache), ముక్కు మూసుకుపోవడం లేదా ముక్కు కారడం వంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు నాలుగు కొత్త సంకేతాలు వెలువడ్డాయి. దీనిలో చర్మం నుంచి గోళ్ల వరకు ఉన్నాయి. కరోనా కొత్త లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చర్మంపై గాయాలు: కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న చాలా మంది చర్మ (Skin)సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాస్తవానికి 2021 లో ప్రచురించిన ఒక యుకె అధ్యయనం ఐదుగురిలో ఒకరికి చర్మంపై దద్దుర్ల సమస్య ఉందని కనుగొంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతమందికి చర్మంపై దద్దుర్లు (Rash on the skin) వచ్చే అవకాశం ఉందని తేలింది.
2. గోర్ల రంగు మారడం: గోర్ల రంగు (nail color) మారడం కూడా కరోనా లక్షణం కావచ్చంటున్నారు నిపుణులు. సార్స్-కోవ్-2 సమయంలో మన శరీరం సహజంగా ఒత్తిడికి లోనవుతుంది. ఈ విషయం గోర్ల ద్వారా కూడా బాడీ తెలియజేస్తుంది. శారీరక ఒత్తిడి కారణంగా గోళ్ల పెరుగుదలలో తాత్కాలిక అవరోధం ఏర్పడుతుంది. దీని వల్ల వేళ్ల గోళ్లపై హారిజాంటల్ లైన్లు వస్తాయి. ఇవి నారింజ రంగు , తెలుపు రంగులో ఉండవచ్చు. కోవిడ్ గోళ్లతో సంబంధం ఉన్న లక్షణాల గణాంకాలు ఇంకా స్పష్టంగా లేవు. కానీ అంచనాల ప్రకారం.. కోవిడ్ రోగులలో ఒకటి నుంచి రెండు శాతం మందికి ఈ లక్షణాలు ఉన్నాయి.
3. జుట్టు రాలడం కూడా కోవిడ్ లక్షణం. కరోనా సంక్రమణ (Corona infection)తరువాత కూడా చాలా మంది కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. కరోనాతో బాధపడుతున్న 6,000 మందిలో 48 శాతం మందికి జుట్టు రాలే (Hair loss)సమస్య ఉందని అధ్యయనంలో వెల్లడైంది. లాంగ్ కోవిడ్ కారణంగా అస్వస్థతకు గురైన వారిలో ఇది ఎక్కువగా ఉందని తేలింది.
4. వినికిడి లోపం (Hearing loss), టిన్నిటస్ ఫ్లూ (Tinnitus flu), తట్టు (Measles)వంటి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే కోవిడ్ చెవి లోపలి కణాలను ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది. కొన్నిసార్లు సంక్రామ్యత (Infection) తరువాత వినికిడి లోపం లేదా టిన్నిటస్ (చెవిలో నిరంతరం రింగింగ్ సెన్సేషన్) ఉంటుంది. 560 మంది పాల్గొన్న ఒక సమీక్షా అధ్యయనంలో.. కోవిడ్ ఉన్న 3.1% మంది రోగులలో వినికిడి లోపం సంభవించిందని కనుగొనబడింది. అయితే టిన్నిటస్ మాత్రం 4.5% మందిలో సంభవించింది. కోవిడ్ నిర్ధారణ అయిన 30 మందిపై జరిపిన అధ్యయనంలో.. కోవిడ్ సోకక ముందు వీరికి ఎలాంటి వినికిడి సమస్య లేదు. కానీ కోవిడ్ సోకిన తర్వాతే ఈ సమస్య తలెత్తిందని పరిశోధకులు కనుగొన్నారు. కోవిడ్ కు సంబంధించిన శాశ్వత వినికిడి లోపం కేసులు కూడా నివేదించబడ్డాయి.