వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు ఇంటి చిట్కాలు
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఖరీదైన ఆయిల్స్, శాంపూలు వాడాల్సిన పనిలేదు. కేవలం కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలు చాలు అంటున్నారు నిపుణులు.
ఎన్ని శాంపూలు, ఆయిల్స్ వాడినా.. జుట్టు ఊడటం, చిట్లడం లాంటివి మాత్రం ఆగడం లేదు.. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా బాధపడని వారి సంఖ్యచాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే.. ఈ మధ్యకాంలో జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా మారిపోవడం లాంటి సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఖరీదైన ఆయిల్స్, శాంపూలు వాడాల్సిన పనిలేదు. కేవలం కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలు చాలు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..
1. తేనె-అరటిపండు... వర్షాకాలంలో బాగా డ్రైగా లేదా చిక్కుబడి ఉండే జుట్టుకు తేనె-అరటి పండు మిశ్రమంతో తలకు పట్టించి 1గంట తర్వాత శుభ్రం చేసుకుంటే, జుట్టు ఎల్లప్పుడు పొడిపొడిగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది.
2.నిమ్మరసం... ఆయిల్ ఫ్రీ హెయిర్ పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించి15 నిముషాలు అలాగే ఉండి తర్వాత తలస్నానం చేయాలి. ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
3.తేనె-ఆయిల్ మాస్క్ లైట్ ఆయిల్(బాదం లేదా ఆలివ్ ఆయిల్) రెండు చెంచాలు. ఒక పార్ట్ తేనెను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి . 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టును రిపేర్ చేస్తుంది
4.మొంతులు మెంతులు జుట్టు సంరక్షణలో అనేక అద్భుతాలను చేస్తుంది. నీటిలో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి . తర్వాత రోజు ఉదయం నీరు వంపేసి, ఆ నీటిలో తలస్నానానికి ఉపయోగిస్తే జుట్టు సమస్యలు బలహీనమైన జుట్టు, చుండ్రు వంటివాటిని నివారించబడుతాయి.