గరుడపురణంలో చెప్పిన ఈ ఐదు పాటిస్తే.. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.

ప్రతీ మనిషికి జీవితంలో విజయం సాధించాలనే తపన ఉంటుంది. అందుకోసమే కృషి చేస్తుంటారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు తన విజయ సాధన దిశగా కృషి చేస్తుంటారు. అయితే విజయం సాధించాలంటే కచ్చితంగా ఐదు నియమాలను పాటించాలని గరుడ పురాణం చెబుతోంది. ఆ 5 విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

According to garuda purana follow these rules for success in life VNR

గరుడ పురాణం అనగానే చాలా మందికి ఠక్కు గుర్తొచ్చేది మరణించిన తర్వాత నరకంలో వేసే శిక్షలు. మనిషి జీవించినంత కాలం చేసిన కర్మలకు ఫలితంగా చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయన్న ప్రతీ విషయాన్ని గరుడ పురాణంలో వివరించారు. అయితే గరడు పురాణం అంటే కేవలం మరణాంతరానికి సంబంధించిన విషయాలే కాకుండా జీవించి ఉన్న సమయంలో వర్తించే విషయాలను కూడా ప్రస్తావించారు. గరుడ పురుణంలో మనిషి ఎలా జీవించాలన్న విషయాలను పేర్కొన్నారు. అదే విధంగా జీవితంలో విజయం సాధించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలన్న విషయాలను సైతం తెలిపారు. ఇంతకీ అవేంటంటే.. 


ఉదయాన్నే నిద్రలేవడం.. 


విజయం సాధించాలంటే గరుడ పురాణంలో పేర్కొన్న మొదటి అంశం ఉదయాన్నే నిద్ర లేవడం. అందరికీ రోజుకు 24 గంటలు మాత్రమే ఉంటుంది. అయితే వాటిలో ఎవరు ఎక్కువ నాణ్యతతో కూడిన సమయాన్ని వినియోగించుకుంటారన్న దానిపై వారి విజయం ఆధారపడి ఉంటుంది. ఉదయం త్వరగా నిద్రలేచే వారికి సహజంగానే సమయం ఎక్కువగా దొరుకుతుంది. ఈ సమయాన్ని వినియోగించుకుంటే విజయానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం వచ్చే స్వచ్ఛమైన గాలి, వెలుతురు శరీరాన్ని, మనసును ఉద్దేశంగా ఉంచుతుంది. ఇది రోజంతా హుషారుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. ఉదయం ఎక్కువసేపు నిద్రపోయే వారికి వయసు తగ్గుతుందని, ఇది విజయ అవకాశాలను తగ్గిస్తుందని గరుడ పురణంలో పేర్కొన్నారు. 

వ్యక్తిగత పరిశుభ్రత..

జీవితంలో విజయం సాధించాలంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని గరుడ పురాణంలో పేర్కొన్నారు. ముఖ్యంగా శుభ్రమైన దుస్తులను ధరించాలి. దుస్తుల నుంచి ఎలాంటి చెడు వాసన రాకుండా మంచిగా ఉతికిన దుస్తులనే ధరించాలి. అదే విధంగా మురికగా ఉన్న దుస్తులను ధరిస్తే అలాంటి వారిపై లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండదని గరుడ పురణంలో పేర్కొన్నారు. అదే విధంగా మీరు ధరించిన దుస్తుల ద్వారానే మీకు గౌరవం లభిస్తుందనే విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్న వారికి సమాజంలో లభించే గౌరవం మరోలా ఉంటుంది. 

ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి

విజయం మీ సొంతం కావాలంటే విజయం కోసం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలని గరుడపురాణంలో పేర్కొన్నారు. విజయం ఒక్కరోజులో వస్తుందన్న ఆలోచనను విడిచిపెట్టి ప్రతీ క్షణం విజయం కోసం కృషి  చేస్తూనే ఉండాలి. జీవితంలో చాలాసార్లు కష్టపడి పనిచేసినా ప్రతిఫలం రాదు. అయితే అంతమాత్రానికే నిరాశచెంది వెనుకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగితే ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుందని గరుడ పురాణంలో తెలిపారు. 

అలాంటి వారికి దూరంగా 

జీవితంలో విజయం సాధించాలంటే ఉండాల్సిన మరో లక్షణం. తప్పుడు సాంగత్యానికి దూరంగా ఉండడం. తప్పుడు సహవాసాలు ఎప్పటికైనా అనర్థాలకు దారి తీస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్నేహం కారణంగా తప్పుడు వ్యక్తులతో ఉంటే మీరు ఎప్పుడు విజయాన్ని అందుకోలేరు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్నవారితో, మిమ్మల్ని నిత్యం నిరాశకు గురి చేసే వారితో దూరంగా ఉండాలని గరుడపురాణంలో పేర్కొన్నారు. 

గర్వం ఉండకూడదు.. 


మనిషి పతనానికి ప్రధాన కారణాల్లో గర్వం ఒకటి. డబ్బు, జ్ఞానం విషయాల్లో గర్వం అస్సలు పనికిరాదు. సరస్వతి, లక్ష్మి దేవతల అనుగ్రహం ఉండాలంటే గర్వం తలకు ఎక్కకూడదని గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎంతటి జ్ఞానమున్న వ్యక్తి అయినా గర్వం తలకు ఎక్కితే వినాశం తప్పదని చెబుతారు. అందుకే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న సిద్ధాంతాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా అయితేనే ఆ వ్యక్తిని విజయం వరిస్తుంది.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios