చాణక్య నీతి.. ఇలాంటి వారితో స్నేహం చేస్తున్నారా.? జాగ్రత్తగా ఉండాల్సిందే..

మనిషి సన్మార్గంలో నడించేందుకు పాటించాల్సిన ఎన్నో సూచనలను చాణక్య నీతిలో పేర్కొన్నారు. ఎవరితో ఎలా ఉండాలి.? ఎలాంటి వ్యక్తులతో సావాసం చేయాలి? ఇలా ఎన్నో విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు. మరి స్నేహితుల విషయంలో చాణక్య నీతిలో ఎలాంటి విషయాలు పేర్కొన్నారు. ఎలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

According to chanakya niti beware of with this kind of friends

మన బంధువులను ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కానీ స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. అందుకే స్నేహానికి ఎంతో విలువ ఉంటుంది. స్నేహ బంధం ఎంతో గొప్పదని చెబుతుంటారు. ప్రతీ ఒక్కరికీ జీవితంలో ప్రతీ దశలో స్నేహితులు కచ్చితంగా ఉంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని విషయాలను కూడా స్నేహితులతో పంచుకోగలం. అలాంటి స్నేహం గురించి చాణక్య నీతిలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో చాణక్య నీతి చెబుతోంది. 

ఇలాంటి వారికి దూరంగా.. 

స్నేహంలో మంచి, చెడు అనే తేడా ఉండదని చాలా మంది అంటుంటారు. కానీ మీతో స్నేహం చేసే వ్యక్తి కచ్చితంగా చెడు అలవాట్లు లేని వాడై ఉండాలని గుర్తు పెట్టుకోండి. స్నేహితుల్లో ఉండే చెడును అంగీకరించే గొప్ప మనసు మీకున్న కొన్ని రోజుల్లో మీరు కూడా వారిలా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చెడు అలవాట్లు ఉన్న వారితో స్నేహం చేస్తే ప్రయోజనం ఉండకపోగా నష్టం ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది. 

స్వార్థపరులకు 

స్వార్థపరులతో స్నేహం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు కేవలం వారి కోసం మాత్రమే ఆలోచిస్తారు. తమ అవసరాలకు తీరడానికి ఎంతకైనా తెగిస్తుంటారు. చివరికి స్నేహంగా ఉన్న మిమ్మల్ని కూడా మోసం చేసేందుకు వెనుకాడరు. కాబట్టి స్వార్థపరులతో అంటీముట్టనట్లే ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. 

తెలివిలేని వారితో.. 

తెలివిలేని వారు తమ చుట్టూ ఉన్న వారిని కూడా తెలివి తక్కువగా మార్చేస్తుంటారు. ఇలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా అదే జాబితాలో చేరుతారు. ముఖ్యంగా ఇలాంటి వారు ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని పాడు చేస్తాయి. తెలివిలేని వారితో సాన్నిహిత్యం ఎప్పటికైనా ప్రమాదకరమేనని గుర్తించాలి. 

మీ గురించి చెడుగా చెప్పేవారు 

కొందరు స్నేహితులుగా ఉంటూనే మీకు వెన్నుపోటు పొడుస్తుంటారు. మీతో మంచిగా ఉంటూనే మీ గురించి ఇతరులకు చెడుగా చెబుతుంటారు. ఇలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి వారిని ఎప్పటికీ నమ్మకూడదు. అవకాశం దొరికినప్పుడు దెబ్బతీసేందుకు సిద్ధంగా ఉంటారు. 

మంచి స్నేహితుడికి ఉండే లక్షణాలు.. 

మంచి స్నేహితుడు అంటే అన్ని విషయాల్లో మీకు మద్ధతు ఇచ్చే వాడే అని కాదు. మీరు తప్పు చేస్తుంటే వద్దని వాదించే వాడు కూడా మంచి స్నేహితుడిగానే భావించాలి. మీ పరిస్థితి అర్థం చేసుకొని మీకు సరైన సలహాలు ఇచ్చే వాడే అసలైన స్నేహితుడు. ఇక మంచి స్నేహితుడికి ఉండాల్సిన మరో లక్షణం మీ తప్పులను క్షమించగలగడం. చిన్న తప్పు చేశారన్న కారణంతో దూరం పెట్టకూడదు. తప్పును అర్థమయ్యేలా చెప్పి, మరోసారి ఆ తప్పును చేయనివ్వని వాడే అసలైన స్నేహితుడు. తన ఫ్రెండ్‌ విజయాన్ని తన విజయంగా భావించేంత గొప్ప మనసున్న వాడే నిజమైన స్నేహితుడు. అలా కాకుండా ఈర్శ్యతో ఊగిపోయేవాడు ఎప్పుడూ మంచి స్నేహితుడు కాలేడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios