నిమ్మరసంతో పుష్కల ప్రయోజనాలు: గోరు వెచ్చని నీటితో తాగితే పలు రోగాలకు చెక్

First Published 28, Jul 2018, 12:41 PM IST
8 Benefits of Lime Water for Health and Weight Loss
Highlights

గోరు వెచ్చని నీటితో నిమ్మరసం కలిపి తాగడంతో బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె సంబంధ వ్యాధులతోపాటు క్యాన్సర్ సమస్యలను అరికడుతుంది నిమ్మరసం.

మానవుడి శరీరం 60 శాతం నీటితో నిండి ఉంటుంది. మీ ఆరోగ్యానికి నీరు కూడా అంతే ముఖ్యం. శరీరంలో ఉన్న విషాన్ని నీరు బటయకు లాగేస్తుంది. అలాగే డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. రోజుకు ఎనిమిది ఔన్సుల గ్లాస్‌ల నీరు తాగితే పౌరుల ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. రుచీపచీ లేని మంచినీరుకు బదులు పండ్ల రసాలు, టీ తాగడానికి ప్రాధాన్యం ఇస్తే మరీ మంచిది. తీపిగా ఉండే పానీయాలతో పలు కేలరీలు ఉంటాయి. దీనికి బదులు నిమ్మకాయలతో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఏ కాలంలోనైనా దొరికే నిమ్మలో పలు ఔషధాలు ఉన్నాయి.

ఈ క్రమంలో రోజు నిమ్మరసాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్నాయి. గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర కలుపుకుని తాగటం ఎంతో మంచిది. శుభ్రమైన నీటిని మరిగించి మనం తాగే వేడి వరకు చల్లార్చాలి. కాచిన గ్లాస్‌ నీటిలో గింజలు రాకుండా ఒక నిమ్మకాయ రసం పిండి పరగడుపున తీసుకోవాలి. తరువాత గంటకి అల్పాహారం తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి.

ప్రతీరోజు వేడినీటితో నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రపడటంతోపాటు పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాక కాలేయం మరిన్ని ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మల బద్ధకం తగ్గిపోతుంది. నిమ్మరసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. భోజనానికి ముందు నిమ్మరసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది యూరిక్‌ యాసిడ్‌ను పలుచన చేసి కీళ్లనొప్పులు, గేట్స్‌ వంటి రుగ్మతలను తగ్గించివేస్తుంది. చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిలో బాగా లాలాజలం ఊరుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని కఫాన్ని తగ్గిస్తుంది. అధిక బరువును అదుపులోకి తెస్తుంది.

శరీరంలో వేడిని నియంత్రించి, శరీరానికి కావాల్సిన చలువదనాన్ని అందిస్తుంది.


అధిక రక్తపోటును అదపులో ఉంచుతుంది. నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పోటాషియం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ రసం సోడియంతో కలిసి మెదడు, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో పోటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళన, ఒత్తిడి మందకొడితనం వంటి సమస్యలు దరిచేరవు.
రక్తంలో క్యాల్షియం, మెగ్నిషియం నిల్వలు సమృద్ధిగా ఏర్పడుతాయి. తగిన స్థాయిలో కాల్షియం ఉండటం వల్ల రికెట్స్‌ వ్యాధి సోకే అవకాశం ఉండదు. మెగ్నీషియం గుండెకు చాలా మంచిది. క్యాన్సర్ కారకాలను నిమ్మరసం నిరోధిస్తుంది. కడుపులో మంటను తగ్గించివేస్తుంది. 

loader