ఇంట్లో ఉన్న పాత పేపర్లని పడేయకండి! ఇంటి ని శుభ్రం చేయడం దగ్గర నుంచి గార్డెనింగ్ వరకు ఈ పేపర్లను ఎలా వాడాలో తెలుసుకుందాం..
ఇంట్లో పాత పేపర్లు పేరుకుపోవడం సర్వసాధారణం. చాలా మంది వాటిని పడేస్తారు. కానీ ఈ పాత పేపర్లు చాలా ఇంటి పనుల్లో ఉపయోగపడతాయి. శుభ్రత నుండి కూరగాయలు నిల్వ చేయడం వరకు, పాత పేపర్లతో చాలా స్మార్ట్ చిట్కాలు ఉన్నాయి. ఇవి మీ ఇంటిని చక్కగా ఉంచడమే కాకుండా, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కూడా అవుతాయి. అలాంటి 5 చక్కని, ఉపయోగకరమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
1. గాజు, అద్దాల శుభ్రతకు
అద్దాలు, కిటికీలు, గాజు బల్లల శుభ్రతకు పేపర్ వాడండి. మరకలు లేకుండా మిలమిలలాడుతూ ఉంటాయి. వెనిగర్ లేదా లిక్విడ్ క్లీనర్ చల్లి పేపర్ తో తుడిస్తే మెరుస్తాయి.
2. కూరగాయలు నిల్వ చేయడానికి
క్యారెట్, ముల్లంగి, పాలకూర లాంటివి త్వరగా పాడవుతాయి. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పేపర్లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
3. తడి బూట్లు, చెప్పుల నుండి తేమను పోగొట్టడానికి
వర్షంలో తడిసిన బూట్లలో దుర్వాసన, తేమ వస్తాయి. వాటిలో పేపర్ నింపి రాత్రంతా ఉంచితే తేమ పోతుంది. మరుసటి రోజు వాడొచ్చు.
4. పెంపుడు జంతువుల కింద పరచడానికి
మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే, వాటి తినే చోట, టాయిలెట్ దగ్గర పేపర్ పరచండి. శుభ్రం చేయడం సులభం అవుతుంది.
5. పాత వస్తువులు, పాత్రలు ప్యాక్ చేయడానికి
ఇల్లు మారేటప్పుడు, ప్రయాణాల్లో, పాత్రలు ప్యాక్ చేసేటప్పుడు పేపర్ చాలా ఉపయోగపడుతుంది. వస్తువులు గీసుకోకుండా, పగిలిపోకుండా కాపాడుతుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తుంది.
6. తోటలో కలుపు మొక్కలు రాకుండా
మొక్కల చుట్టూ పేపర్ పరచి, దానిపై కొద్దిగా మట్టి వేయండి. కలుపు మొక్కలు రావు. పేపర్ కుళ్ళిపోయి ఎరువుగా మారుతుంది.
7. బహుమతులు చుట్టడానికి
రంగురంగుల మ్యాగజైన్ పేజీలు లేదా పేపర్ తో బహుమతులు చుట్టడం చాలా బాగుంటుంది. పైన ఒక రిబ్బన్ లేదా పువ్వు కడితే చాలు.


