MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Tips and Tricks: ఇవి రాస్తే, గంటలో బొద్దింకలు మటుమాయం అవుతాయి..!

Tips and Tricks: ఇవి రాస్తే, గంటలో బొద్దింకలు మటుమాయం అవుతాయి..!

మన కిచెన్ లో పచ్చి మిరపకాయలు కచ్చితంగా ఉంటాయి. వీటిని వాడే మనం బొద్దింకలను శాశ్వతంగా తరిమి కొట్టచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 31 2025, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బొద్దింకలను తరిమికొట్టేందుకు బెస్ట్ చిట్కా
Image Credit : our own

బొద్దింకలను తరిమికొట్టేందుకు బెస్ట్ చిట్కా

మీ ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయా? ముఖ్యంగా వంటింట్లో, కిచెన్ సింకుల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. బొద్దింకలు ఇంట్లో తిరుగుతుంటే చూడటానికే ఇబ్బందిగా ఉంటుంది. అంతేనా.. వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా అన్నీ ఇన్నీ కావు.వీటిని తరిమికొట్టేందుకు చాలా మంది కెమికల్స్ ఉండే స్ప్రేలను వాడుతూ ఉంటారు.కానీ, ఆ కెమికల్స్ లేకుండా కూడా బొద్దింకలు, బల్లులను చలా తక్కువ సమయంలో, పూర్తిగా తరిమికొట్టొచ్చు. అదెలాగో తెలుసుకుందామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హోం రెమిడీ..
Image Credit : freepik

హోం రెమిడీ..

మన కిచెన్ లో పచ్చి మిరపకాయలు కచ్చితంగా ఉంటాయి. వీటిని వాడే మనం బొద్దింకలను శాశ్వతంగా తరిమి కొట్టచ్చు. ఈ మిరపకాయల తో పాటు వెల్లుల్లి రెబ్బలు వాడితే చాలు. మరి, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..

కారం ఎక్కువగా ఉండే 4 నుంచి 5 పచ్చి మిరపకాయలు తీసుకోవాలి. అదేవిధంగా రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. దీనితో పాటు ఒక కప్పు నీరు తీసుకోవాలి.

34
ఎలా తయారుచేయాలి:
Image Credit : pixabay

ఎలా తయారుచేయాలి:

మిరపకాయలను చిన్న ముక్కలుగా కోయండి లేదా నలిపివేయండి.వెల్లుల్లిని కూడా బాగా నలిపి, చిన్న ముద్దలా తయారుచేయండి.ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో నలిపిన మిరపకాయలు, వెల్లుల్లిని కలపండి.ఈ మిశ్రమాన్ని కనీసం ఒక గంట పాటు నానబెట్టండి.

ఈ సమయంలో మిరపకాయల్లోని కాప్సైసిన్ , వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సహజ రసాయనాలు నీటిలో కలిసిపోతాయి. ఇవి కలసి ఒక ఘాటైన వాసన కలిగిన ద్రవాన్ని తయారు చేస్తాయి. బొద్దింకలు, బల్లులకు ఈ వాసన పడదు. ఈ వాసనకు వెంటనే పారిపోతాయి.

44
ఎలా ఉపయోగించాలి:
Image Credit : others

ఎలా ఉపయోగించాలి:

ఈ మిశ్రమాన్ని వడకట్టి స్ప్రే బాటిల్‌లోకి పోయండి. బొద్దింకలు, బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో, ముఖ్యంగా వంటగది, బాత్‌రూమ్ మూలల్లో, కప్‌బోర్డు వెనక ఈ ద్రవాన్ని స్ప్రే చేయండి.దీన్ని ముఖ్యంగా రాత్రివేళ స్ప్రే చేస్తే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక..

పిల్లలు లేదా పెంపుడు జంతువులకు ఈ ద్రవం తగలకుండా జాగ్రత్త వహించండి. ఇది సహజ పదార్థాలతో తయారవుతున్నా, దీని ఘాటు వాసన వల్ల అసౌకర్యం కలగవచ్చు.ప్రతివారం ఈ నివారణను ఒకసారి ఉపయోగిస్తే, బొద్దింకలు, బల్లులు తిరిగి రావడం తగ్గుతుంది.వంటగదిలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

ముగింపు:

ఈ సహజ గృహ నివారణతో మీ ఇంటిని బొద్దింకలు, బల్లుల నుండి శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇది కెమికల్స్ లేకుండా, ఆరోగ్యానికి హాని కలిగించకుండా పనిచేస్తుంది. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఘాటైన లక్షణాలు వాటిని దూరంగా ఉంచుతాయి. ఈ హోం రెమిడీని ప్రయత్నించి చూడండి. కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Recommended image2
Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
Recommended image3
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved