ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయాల్లో విలేజ్ సర్వేయర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ సచివాలయాల్లో విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్డులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31. అయితే జనవరి 30 తేదీన ఫీజు చెల్లింపు ప్రక్రియ ముగుస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


 విలేజ్ సర్వేయర్ పోస్టుల వివరాలు

 విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-3)పోస్టుల మొత్తం ఖాళీలు 1255

also read ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ...అప్లై చేసుకోండీ వెంటనే

 శ్రీకాకుళం 159, విజయనగరం 151, విశాఖపట్నం 111, తూర్పు గోదావరి 36, పశ్చిమ గోదావరి 155, కృష్ణా 70, గుంటూరు 16, ప్రకాశం 144, నెల్లూరు 109, చిత్తూరు 131, అనంతపురం 19, కర్నూలు 140, కడప 14.


అర్హత: NCTV డ్రాట్స్‌మ్యాన్ సర్టిఫికేట్(సివిల్)/ ఇంటర్ ఒకేషనల్(సర్వేయింగ్)/ ఇంజినీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్). లైసెన్స్‌డ్ సర్వేయర్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాలీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు ప్రతి జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాలీ.

also read Bank Jobs: ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ

దరఖాస్తు: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: ఎంపికైన వారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.15,000 ఇస్తారు. ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పనితీరు ఆధారంగా, నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2020 చివరి తేది 30.01.2020