ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. రాత పరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 570

also read Bank Jobs: ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ

శ్రీకాకుళం 60
విజయనగరం 81
విశాఖపట్నం 24
తూర్పు గోదావరి 50
పశ్చిమ గోదావరి 66
కృష్ణా 35
గుంటూరు 30
ప్రకాశం 74
నెల్లూరు 35
చిత్తూరు 50
అనంతపురం 19
కర్నూలు 34
కడప 12
మొత్తం 570

అర్హత: డిగ్రీ/డిప్లొమా (సివిల్/మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.07.1978 నుండి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

also read BANK Jobs:ఎస్‌బి‌ఐ బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు ప్రతి జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:  రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం: పోస్టులకి ఎంపికైన వారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.15,000 ఇస్తారు. ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు పనితీరు ఆధారంగా, నిబంధనల ప్రకారం వేతనంలో పెంపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2020 దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేది 30.01.2020