MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Government Jobs
  • Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ TGPSC మరో జాాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 04 2026, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టిజిపిఎస్సి జాాబ్ నోటిఫికేషన్
Image Credit : gemini

టిజిపిఎస్సి జాాబ్ నోటిఫికేషన్

TGPSC Notification 2026 : చాలామంది యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కంటుంటారు.. ఇందుకోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. రాత్రనకా పగలనకా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతుంటారు... కోచింగ్ సెంటర్లు, స్టడి సర్కిల్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.

ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి టిజిపిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేశాయి... తాజాగా వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి శాలరీతో కూడిన స్టేట్ లెవెల్ ప్రభుత్వం ఉద్యోగమిది... గట్టిగా ట్రై చేస్తే పక్కా జాబ్, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ
Image Credit : Getty

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ

పోస్ట్ : తెలంగాణ సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్

TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా కార్యాలయంలో ఇవ్వడం లేదా ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 07-07-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 12-08-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు 

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 చెల్లించాలి

37
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ప్రాసెస్
Image Credit : Getty

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ప్రాసెస్

రాతపరీక్ష అక్టోబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

ఎగ్జామ్ ప్రాసెస్

రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ తో ఎగ్జామ్ నిర్వహిస్తారు.

పేపర్ 1

జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

పేపర్ 2

ఉద్యోగ అర్హతలకు సంబంధించిన సబ్జెక్ట్ పై ప్రశ్నలు ఉంటాయి. (కామన్ సిలబస్, పిజి లెవెల్) - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (కేవలం ఇంగ్లీష్ లోనే ప్రశ్నపత్రం ఉంటుంది)

47
రిజర్వేషన్లవారిగా సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఖాళీలు..
Image Credit : Getty

రిజర్వేషన్లవారిగా సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఖాళీలు..

తెలంగాణ సీడ్ ఆండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో మొత్తం 19 సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ పోస్టులను టిజిపిఎస్సి భర్తీ చేస్తోంది. ఇవి స్టేట్ లెవెల్ ఉద్యోగాలు. రిజర్వేషన్ల వారిగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి...

ఓసి - 4

ఈడబ్ల్యుఎస్ - 3

బిసి-బి - 1

బిసి-డి - 3

ఎస్సి - 3

ఎస్టి - 2

పిహెచ్ (దివ్యాంగులు) - 2

స్పోర్ట్స్ కోటా - 1

57
సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయోపరిమితి
Image Credit : Getty

సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు వయోపరిమితి

 సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు 18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు.

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC - 3 ఏళ్లు సడలింపు

67
సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలేంటి?
Image Credit : Getty

సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలేంటి?

సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అగ్రికల్చర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ ఆగ్రోనమీ/ ప్లాంట్ ఫిజియోలజీలో ఎమ్మెస్సి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చేసివుండాలి. ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థలో చదివివుండాలి.

77
సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ శాలరీ ఎంతుంటుంది?
Image Credit : Getty

సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ శాలరీ ఎంతుంటుంది?

తెలంగాణ సీడ్ ఆండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ లో సీడ్ సర్టిఫిషన్ ఆఫీసర్ ఉద్యోగాలు స్టేట్ లెవెల్ కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.51,320 నుండి రూ.1,27,310 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image2
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image3
Indian Railway Recruitment: 4,098 ఖాళీలకు నోటిఫికేషన్... ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఓసారి చెక్ చేసుకోండి
Related Stories
Recommended image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Recommended image2
TGPSC Jobs Notification 2026 : తెలుగు యువతకు బంపరాఫర్.. స్టార్టింగే నెలనెలా రూ.54,220 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved