Bank Jobs: ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ

 ఇండియ‌న్ బ్యాంకులో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీతో పాటు తగిన అనుభవం కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. 

indian bank released notification for the recruitment of specialist officers posts

చెన్నై ప్రధాన‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియ‌న్ బ్యాంకులో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీతో పాటు తగిన అనుభవం కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికలు నిర్వహిస్తారు.

ఇండియ‌న్ బ్యాంకులో ఖాళీగా ఉన్న​  పోస్టుల వివ‌రాలు

also read BANK Jobs:ఎస్‌బి‌ఐ బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండి


స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్: 138 పోస్టులు

 అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (క్రెడిట్): 85

మేనేజ‌ర్ (క్రెడిట్): 15

 మేనేజ‌ర్ (సెక్యూరిటీ): 15

 మేనేజ‌ర్ (ఫోరెక్స్): 10

 మేనేజ‌ర్ (లీగల్): 02

 మేనేజ‌ర్ (డీలర్): 05

 మేనేజ‌ర్ (రిస్క్ మేనేజ్‌మెంట్): 05

 సీనియర్ మేనేజ‌ర్ (రిస్క్ మేనేజ్‌మెంట్): 01

​అర్హత: పోస్టుల వారీగా  తగిన విద్యార్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు డిగ్రీ, మరికొన్ని పోస్టులకు డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత పొంది ఉండాలి. అన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

​వయోపరిమితి: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20-30 సంవత్సరాలు, మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-37 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

also read న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు ఉంటాయి.


 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 22.01.2020  చివరితేది: 10.02.2020.


రాత ప‌రీక్షతేది: 08.03.2020.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios