పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. కానీ చదివేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చాలామంది అనుకున్నది సాధించలేకపోతారు. అయితే కొన్ని ఈజీ టెక్నిక్స్ తో చక్కగా చదువుకోవచ్చు. చదివింది గుర్తించుకోవచ్చు. అవేంటో చూద్దామా.. 

చదువులో రాణించడానికి పుస్తకాల ముందు గంటల తరబడి కూర్చుంటే సరిపోదు. సరైన ప్రణాళిక, టెక్నిక్స్ ఉపయోగిస్తే ఏ విషయాన్ని అయినా త్వరగా నేర్చుకోవచ్చు. సులభంగా గుర్తుంచుకోవచ్చు. స్కూల్, కాలేజ్ విద్యార్థులతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

 ప్రతి విద్యార్థికి ఉపయోగపడే టాప్ 10 స్టడీ టిప్స్..

1. టైమ్ టేబుల్ 

చదువులో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. రోజూ చదువుకోడానికి ఒక టైమ్ టేబుల్ పెట్టుకుని, ప్రతి సబ్జెక్టుకి సరిపడా సమయం కేటాయించండి. పెద్ద సబ్జెక్టులని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటే చదువుకోవడం ఈజీ అవుతుంది. చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా ముందుగానే ప్రిపేర్ అవ్వండి.

2. యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించండి

కేవలం చదవడమే కాదు.. నేర్చుకున్నది అర్థం చేసుకోవడానికి యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించండి. పాఠాలని మీ సొంత మాటల్లో రాసుకోండి. ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి. లేదా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. ఇలా చేస్తే బాగా గుర్తుంటుంది.

3. ప్రశాంతమైన చోట చదువుకోండి

నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే చోట చదువుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. మంచి లైటింగ్, శుభ్రమైన వాతావరణం, కంఫర్టబుల్ కుర్చీ/టేబుల్ ఉంటే ఎక్కువసేపు చదువుకోవచ్చు.

4. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి

ఎక్కువసేపు చదవకుండా, పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25-30 నిమిషాలు చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

5. నోట్స్ రాసుకోండి

నోట్స్ రాసుకునేటప్పుడు అన్నీ కాపీ కొట్టకుండా.. ముఖ్యమైన పాయింట్స్, డేట్స్, ఫార్ములాలు లేదా డయాగ్రమ్స్ మీ సొంత స్టైల్ లో రాసుకోండి. డిజిటల్ నోట్స్ యాప్స్ కూడా ఉపయోగించవచ్చు.

6. రివిజన్ చేయండి

చదివినవి గుర్తుంచుకోవడానికి స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. అంటే కొంత టైం గ్యాప్ తర్వాత చదివినవి మళ్లీ మళ్లీ రివిజన్ చేసుకోవాలి. ఇది లాంగ్ టర్మ్ మెమరీని పెంచుతుంది.

7. ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించండి

ఇప్పుడు ఇంటర్నెట్ చదువుకోవడానికి చాలా మంచి సాధనం. YouTube వీడియోస్, ఎడ్యుకేషన్ యాప్స్, ఆన్లైన్ కోర్సులు కష్టమైన టాపిక్స్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

8. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి

గతంలో వచ్చిన పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. దీంతో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

9. ఆరోగ్యంగా ఉండండి, బ్రేక్స్ తీసుకోండి

చదువులో రాణించడానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. మంచి ఆహారం, సరిపడా నిద్ర, రెగ్యులర్ ఎక్సర్సైజ్.. మైండ్ ని యాక్టివ్ గా ఉంచుతాయి. ఎక్కువసేపు చదివితే అలసిపోతారు. కాబట్టి బ్రేక్స్ తీసుకోండి.

10. మీ మీద నమ్మకం ఉంచండి

కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. పాజిటివ్ గా ఉండండి. ఇతరులతో పోల్చుకోకుండా మీ ప్రోగ్రెస్ మీద దృష్టి పెట్టండి. కష్టపడితే గోల్స్ రీచ్ అవుతారు. చదువులో సక్సెస్ అవ్వడం కేవలం తెలివితేటల మీదనే కాదు.. క్రమశిక్షణ, కష్టపడి చదవడం, స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 10 స్టడీ టిప్స్ ఫాలో అయితే.. విద్యార్థులు తమ లెర్నింగ్ స్కిల్స్ ని పెంచుకోవచ్చు, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.