MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Life Skills: ప్రతి ఒక్కరికీ అవసరమైన టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో తెలుసా?

Life Skills: ప్రతి ఒక్కరికీ అవసరమైన టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో తెలుసా?

జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. కానీ ఆ పరిస్థితిలో మనం ఎలా ఉన్నామనేదే ముఖ్యం. కొన్ని లైఫ్ స్కిల్స్ మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికీ అవి అవసరం కూడా. మరి ఆ స్కిల్స్ ఏంటో తెలుసుకుందామా..  

2 Min read
Kavitha G
Published : Aug 13 2025, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Top 10 Essential Life Skills
Image Credit : Getty

Top 10 Essential Life Skills

జీవితం సాఫీగా సాగిపోవడానికి కొన్ని స్కిల్స్ కచ్చితంగా అవసరం. ప్రస్తుత రోజుల్లో డిగ్రీలు, టెక్నాలజీ తెలిసినంత మాత్రాన జీవితం సాఫీగా సాగిపోదు. మన జీవితంలో ఎదుగుదల ఉండాలంటే..  సరిగ్గా ఆలోచించడం, బలమైన సంబంధాలు కలిగి ఉండటం, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించడం వంటి లైఫ్ స్కిల్స్ తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికీ అవసరమైన  టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

25
సమస్య పరిష్కార నైపుణ్యం (Problem-Solving Skills)
Image Credit : Getty

సమస్య పరిష్కార నైపుణ్యం (Problem-Solving Skills)

ప్రతి ఒక్కరు, ప్రతి రోజూ.. ఏదో ఒక సమస్యను ఎదుర్కుంటూనే ఉంటారు. అయితే ఆ సమస్యను అర్థం చేసుకొని.. దానికి పరిష్కారాన్ని వెతకడం ముఖ్యమైన నైపుణ్యం. సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేకపోతే.. ప్రతిసారి ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. 

కమ్యూనికేషన్ స్కిల్స్ (Communication Skills)

ప్రస్తుత రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి. అవగాహనతో ఉండటం, స్పష్టంగా మాట్లాడగలగడం నేర్చుకోవాలి.  వ్యక్తిగత సంబంధాలు, ఉద్యోగ జీవితం, వ్యాపారాలు ఇతర విషయాల్లోనూ ఇది ఎంతో అవసరం.

నిర్ణయం తీసుకునే నైపుణ్యం (Decision Making)

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇది మన అనుభవంతో పాటు, ఆలోచనా శైలితో మెరుగవుతుంది.

Related Articles

Related image1
Money Tips: మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు!
Related image2
Money Saving Tips: లైఫ్ స్టైల్ కొంచెం కూడా చేంజ్ చేయకుండా డబ్బులు సేవ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
35
భావోద్వేగ నియంత్రణ (Emotional Management)
Image Credit : freepik

భావోద్వేగ నియంత్రణ (Emotional Management)

కోపం, భయం, నిరాశ లాంటి భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. వాటిపై నియంత్రణ లేకపోతే.. కొన్నిసార్లు మనం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.  

పరస్పర సంబంధ నెపుణ్యత (Interpersonal Skills)

తోటివారితో బంధం ఏర్పరచుకోవడం, టీంలో పనిచేయడం, వినయంగా వ్యవహరించడం లాంటి లక్షణాలు వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యం.  

45
ఆర్థిక నిర్వహణ (Financial Literacy)
Image Credit : Freepik@jcomp

ఆర్థిక నిర్వహణ (Financial Literacy)

డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా వినియోగించాలి.. ఎలా పొదుపు చేయాలో కూడా తెలిసి ఉండాలి. అప్పులు ఎప్పుడు తీసుకోవాలి.. ఎలా తిరిగి చెల్లించాలి వంటి విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యం.

సమయ నిర్వహణ (Time Management)

సమయాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఆలస్యం, నిర్లక్ష్యం లాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండగలుగుతాం.

ప్రాథమిక జీవన నెపుణ్యతలు (Basic Life Skills)

వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ గా పెట్టుకోవడం వంటి చిన్న పనులు తెలిసి ఉండటం వల్ల స్వతంత్రంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.

55
స్వీయ సంరక్షణ (Self-Care and Hygiene)
Image Credit : Asianet News

స్వీయ సంరక్షణ (Self-Care and Hygiene)

శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శుభ్రత మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. వీటిని నిర్లక్ష్యం చేస్తే జీవితం సాఫీగా సాగదు.  

నిరంతర అభ్యాసం (Continuous Learning)

కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆత్రుత, మారుతున్న సమాజానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వడం వంటివి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved