- Home
- Jobs
- Career Guidance
- Layoffs: వచ్చే 100 రోజుల్లో 50 వేల ఉద్యోగాలు ఫట్.. మీరు కూడా ఇదే జాబ్ చేస్తున్నారా.?
Layoffs: వచ్చే 100 రోజుల్లో 50 వేల ఉద్యోగాలు ఫట్.. మీరు కూడా ఇదే జాబ్ చేస్తున్నారా.?
Layoffs: ఉద్యోగాల తొలగింపు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థలు సైతం ఉద్యోగులను నిర్దాక్షణ్యంగా తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఐటీ రంగంలో కొత్త సంక్షోభం
భారతదేశంలోని ఐటీ రంగం మరో పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరి నాటికి 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ముఖ్యంగా టీసీఎస్, యాక్సెంచర్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల కోతల ప్రణాళికలు రూపొందించాయి. టీసీఎస్ మార్చి 2026 నాటికి తన సిబ్బందిలో 2% (దాదాపు 12,000 మంది) ఉద్యోగులను తొలగించనుంది.
రహస్యంగా సాగుతున్న ఉద్యోగాల కోతలు
కంపెనీలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలను బహిరంగంగా తొలగించడం కాకుండా, రహస్య పద్ధతుల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. పేలవమైన పనితీరు సాకుగా చూపించడం, పదోన్నతులను నిలిపివేయడం లేదా ఉద్యోగులను స్వచ్ఛంద రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం వంటి పద్ధతులు విస్తృతంగా జరుగుతున్నాయి. HFS Research CEO ఫిల్ ఫర్ష్ట్ ప్రకారం, "ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు నిశ్శబ్దంగా వేలాది మందిని తొలగించాయి" అని తెలిపారు.
ఇదే ప్రధాన కారణం
ఈ ఉద్యోగాల కోతల వెనుక ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI). AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడంతో అనేక పనులను ఆటోమేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది కంపెనీలకు ఖర్చు తగ్గింపు మాత్రమే కాకుండా, వ్యూహాత్మక మార్పులకు దోహదం చేస్తోంది. టీసీఎస్, యాక్సెంచర్ వంటి కంపెనీలు AI ఆధారిత టూల్స్‌తో పలు విభాగాలను ఆటోమేట్ చేస్తూ, మానవ శక్తిపై ఆధారాన్ని తగ్గిస్తున్నాయి.
అంతర్జాతీయ పరిస్థితులు కూడా..
AIతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వలస విధానాలు, H-1B వీసా ఖర్చుల పెరుగుదల కూడా ఉద్యోగాల కోతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పుడు క్లయింట్ కాంట్రాక్టులు తగ్గించుకోవడం, కొత్త ప్రాజెక్టులు వాయిదా వేయడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
కొత్త నైపుణ్యాల దిశగా అడుగు వేయాల్సిన సమయం
ఈ పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో పెంచుకోవడం అత్యవసరం. సాంప్రదాయ అవుట్‌సోర్సింగ్ మోడల్‌తో పనిచేస్తున్న సంస్థలు కష్టాల్లో ఉన్నా, టెక్నాలజీ పరిజ్ఞానం పెంచుకుంటున్న కంపెనీలు మాత్రం కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి.