Asianet News TeluguAsianet News Telugu

శిశువుగా కిడ్నాప్ చేయబడి, 51 సంవత్సరాల కుటుంబంతో కలిసిన యుఎస్ మహిళ

ఐదు దశాబ్దాల క్రితం కిడ్నాప్ అయి.. 51యేళ్ల మధ్యవయస్కురాలిగా తన కుటుంబాన్ని కలుసుకుందో మహిళ. ఈ ఘటన అమెరికాలో వైరల్ గా మారింది. 

woman kidnapped as a baby, reunited with family after 51 years in US
Author
First Published Nov 29, 2022, 11:08 AM IST

అమెరికా : 51 యేళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన ఓ చిన్నారి చివరికి ఐదు దశాబ్దాల తరువాత తన కుటుంబాన్ని కలుసుకుంది. ఇన్నేళ్ల వారి ఎదురు చూపులు ఫలించాయి. ఆ చిన్నారి ఇప్పుడు మధ్య వయసులో తన కుటుంబాన్ని కలుసుకుంది. ఆగష్టు 23, 1971న, ది గార్డియన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, మెలిస్సా హైస్మిత్ అనే టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లోని తన ఇంటినుంచి తన చిన్నారిని బేబీ సిట్టర్ కిడ్నాప్ చేసిందని ఆ నివేదిక సారాంశం. 

వివరాల్లోకి వెడితే.. ఆ చిన్నారి తల్లి, అల్టా అపాంటెంకో, తన కూతురిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో... ఒక వార్తాపత్రికలో బేబీ సిటర్ కోసం ఒక ప్రకటన ఇచ్చింది. తనకు ఉద్యోగం, పాపను చూసుకోవడం రెండూ ముఖ్యమే కాబట్టి.. ఆమె కనీసం మొహం కూడా చూడకుండా, ఒక్కసారి కూడా కలవకుండా కేవలం ఫోన్లో మాట్లాడుకునే బేబీ సిట్టర్ ను నియమించుకుంది. అలా పాపను చూసుకోవడానికి వచ్చిన ఆమెకు.. అపాటెన్కో రూమ్‌మేట్ పాపను బేబీ సిట్టర్‌కు అప్పగించాడు. ఆ తరువాత కాసేపటికి ఆమె పాపతో సహా కనిపించకుండా పోయింది. దీంతో కిడ్నాప్ కేసు నమోదయ్యింది. 

వామ్మో.. దోమ కుడితే కోమాలోకి వెళ్లిన యువకుడు.. 30 ఆపరేషన్లు చేస్తేనే తిరిగి మామూలు స్థితిలోకి..

అప్పటినుంచి తన చిన్నారి గురించి ఆ తల్లి వెతుకుతూనే ఉంది. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబరులో, హైస్మిత్ బంధువులకు ఆమె ఫోర్ట్ వర్త్ కు 1,100 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న చార్లెస్టన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆమెకు డీఎన్ఏ పరీక్ష ఫలితాలు, మెలిస్సా పుట్టుమచ్చ, ఆమె పుట్టినరోజు అన్నీ కలిసి.. మెలిస్సా 51 సంవత్సరాల క్రితం తమ కుటుంబం నుంచి.. కిడ్నాప్ చేయబడిన బిడ్డ అని నిరూపించడానికి సహాయపడింది. 

అలా, ఫోర్ట్ వర్త్‌లోని కుటుంబ చర్చిలో జరిగిన వేడుకలో మెలిస్సా తన తల్లి, తండ్రి, తన నలుగురు తోబుట్టువులలో ఇద్దరిని శనివారం కలిశారని ది గార్డియన్ ఒక ప్రకటనలో తెలిపింది. షారన్ హైస్మిత్, మెలిస్సా సోదరి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం ఆమె గుర్తింపులో కీలకమైన డీఎన్ఏ పరీక్షలను అర్థంచేసుకోవడంలో, మెలిస్సాను కనుగొనడానికి పబ్లిక్‌గా అందుబాటులో ఉండే సమాచారాన్ని శోధించడంలో సహాయం కోసం క్లినికల్ లాబొరేటరీ శాస్త్రవేత్త, ఔత్సాహిక వంశపారంపర్య శాస్త్రవేత్త అయిన లిసా జో స్కీలేను సంప్రదించింది.

ఇదేం విడ్డూరం.. మూడున్నర నిమిషాల్లో పాస్తా ఉడకలేదని.. రూ.40 కోట్లకు దావా..

"ఈ కేసును తప్పుగా నిర్వహించిన ఏజెన్సీల చేతుల్లో మా కుటుంబం నష్టపోయింది’ అని షారన్ హైస్మిత్ అన్నారు. "ప్రస్తుతం, మేము మెలిస్సా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆమెను మా కుటుంబంలోకి స్వాగతించాలనుకుంటున్నాం. మేము కోల్పోయిన 50 సంవత్సరాల సమయాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాం" అని ఆమె ది గార్డియన్‌తో మాట్లాడుతూ చెప్పింది. అయితే, తప్పిపోయిన తన కూతురిని హత్య చేసి నేరాన్ని దాచిపెట్టినట్లు వారి తల్లి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios