Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. దోమ కుడితే కోమాలోకి వెళ్లిన యువకుడు.. 30 ఆపరేషన్లు చేస్తేనే తిరిగి మామూలు స్థితిలోకి..

జర్మనీలో ఓ యువకుడిని దోమ కుడితే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఊపిరితిత్తులు చెడిపోయాయి. కోమాలోకి వెళ్లాడు. మోకాలి వరకు ఇన్ఫెక్షన్ సోకింది. దాదాపు 30 ఆపరేషన్లు చేస్తే మామూలు స్థితికి చేరుకున్నాడు. 

the young man who went into coma after being bitten by a mosquito.. returned to normal after 30 operations..
Author
First Published Nov 29, 2022, 9:18 AM IST

దోమ కుడితే ఏమవుతుంది ? కుట్టిన చోట దద్దుర్లు వస్తాయి.. తరువాత మలేరియా, డెంగ్యూలాంటి జ్వరాలు వస్తాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్తే వారందించే ట్రీట్ మెంట్ తో నయమైపోతుంది. కానీ ఓ వ్యక్తి దోమకాటేయడం వల్ల కోమాలోకి వెళ్లాడు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. 30 ఆపరేషన్లు చేస్తేనే తిరిగి అతడు కోలుకున్నాడు. ఇది జర్మనీలో చోటు చేసుకుంది. ఇంతకీ అదేం దోమ ? అది కాటేయడం వల్ల ఏం జరుగుతుంది ? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

కామెరూన్ లో విరిగిపడ్డ కొండచరియలు.. 14 మంది దుర్మరణం..

జర్మనీలోని రోడర్‌మార్క్‌లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల సెబాస్టియన్ రోట్ష్కేకి గతేడాది ఆసియా టైగర్ దోమ కుట్టింది. ‘డైలీ స్టార్’ నివేదికల ప్రకారం.. ఈ దోమకాటు వల్ల ఆయన ఒక్క సారిగా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. రెండు కాలి వేళ్లు కత్తిరించాల్సి వచ్చింది. ట్రీట్ మెంట్ లో భాగంగా 30 ఆపరేషన్లు జరిగాయి. సెబాస్టియన్ రోట్ష్కే బ్లడ్ పాయిజనింగ్‌తో పాటు కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల వైఫల్యం కూడా చెందాయి. బాధితుడికి దోమ కుట్టడం వల్ల ప్రాణాంతక బాక్టీరియ అతడి ఎడమ తొడలో దాదాపు సగం వరకు ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు తెలిపారు. చర్మ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది.

ఆసియా టైగర్ దోమ అంటే ? 
ఏడెస్ అల్బోపిక్టస్ అని దోమ ప్రమాదకరమైన లక్షణాలను చూసి దీనికి ఆసియా టైగర్ దోమ అని పేరుపెట్టారు. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రమాదకరమైన జాతులు ఐరోపాలోని అనేక దేశాలకు కూడా వ్యాపించాయి. ఈ జాతి దోమల కాళ్లు, శరీరంపై తెల్లటి పట్టీలు ఉంటాయి. ఇది సాధారణంగా పగటిపూట కాటు వేస్తుంది. ఈ దోమకాటేయడం వల్ల ఎల్లో ఫీవర్ వైరస్, చికున్‌గున్యా జ్వరం, డైరోఫిలేరియా ఇమ్మిటిస్, అలాగే జికా వైరస్‌తో సహా అనేక వైరల్ వ్యాధులను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మేఘాలయాలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరతారని ఊహాగానాలు..

ఈ దోమ 15 నిమిషాల్లో 20 సార్లు కుట్టగలదు. ఈ జాతికి చెందిన దోమలపై వాతావరణ ప్రభావం ఉండదు. మనిషులు బట్టలు వేసుకున్నా కూడా ఈ దోమలు సులభంగా కుట్టగలవు. ఇది డెంగ్యూ జర్వానికి వాహకంగా పని చేస్తోంది. ఇది అనేక ఆసియా, లాటిన్ అమెరికన్ దేశాలలో అనారోగ్యం, మరణానికి కారణంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. డెంగ్యూ కేసుల సంఖ్య గత రెండు దశాబ్దాలలో ఎనిమిది రెట్లు పెరిగింది. 2000లో 505,430 కేసులు ఉండగా 2021 నాటికి 5.2 మిలియన్లకు చేరుకున్నాయి.

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరిపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

లక్షణాలు.. 
ఈ దోమకాటు వేయడం వల్ల మొదటగా ముఖం, కడుపు, కాళ్లు వాపులు వస్తాయి. వేగంగా శ్వాస తీసుంటారు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఈ దోమలబారి నుంచి తప్పించుకోవాలంటే బాత్రూమ్ లో, వంటగదిలో నిల్వ ఉండే నీటిపై మూతపెట్టాలి. కూలర్ ట్యాంక్ నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ ఉండాలి. పగలు, రాత్రి వేళల్లో ఫుల్ స్లీవ్ దుస్తులను రించాలి. యాంటీ మస్కిటో కాయిల్స్ ఉపయోగించాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios