ఇదేం విడ్డూరం.. మూడున్నర నిమిషాల్లో పాస్తా ఉడకలేదని.. రూ.40 కోట్లకు దావా..
ప్యాక్ మీద చెప్పిన మూడున్నర నిమిషాల్లో పాస్తా ఉడకలేదని ఓ మహిళ ఆ కంపెనీ మీద 40 కోట్లకు దావా వేసింది.

వాషింగ్టన్ : మనందరికీ రెండు నిమిషాల్లో రెడి అయ్యే మ్యాగీ గురించి బాగా తెలుసు. కానీ అది రెండు నిమిషాల్లో కానే కాదు.. ఉడకడానికి కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. వేరే టిఫిన్లతో పోలిస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి.. దీన్ని పెద్దగా పట్టించుకోం. కానీ ఓ మహిళ దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ‘రెండు నిమిషాల్లో రెడీ.. మూడు నిమిషాల్లో రెడీ..’ అని ఇనిస్టెంట్ ఫుడ్ ప్యాకెట్స్ పై ఇచ్చే వివరాల మీద కోర్టులో దావా వేసింది.
అనేక రకాల ఇన్ స్టాంట్ ఫుడ్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి ఇలాంటివి చేస్తుంటాయి. కొన్నిసార్లు వాటిని ఉడికించబోతే చెప్పిన సమయం కంటే ఎక్కువ తీసుకుంటాయి. కాకపోతే అది మామూలే అని మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అలా ఊరుకోలేదు. చెప్పిన టైంలో పాస్తా అండ్ ఛీజ్ వుడకలేదని ఫుడ్ కంపెనీ మీద రూ.40 కోట్లకు దావా వేసింది. ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీ రేజ్.. క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్ ను కొనుగోలు చేసింది.
వచ్చే కరోనా వేరియంట్ ప్రమాదకరంగా ఉండొచ్చు: ల్యాబ్ రిపోర్టు
దాన్ని మైక్రోవేవ్లో ఉడికిస్తే మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్ మీద ఉంది. కానీ అందులో వివరించినట్లుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదు. దీంతో పాక్ మీద ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమండా ఆరోపించింది. పరిహారం కింద రూ.40 కోట్లు, జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.