యోని లేకుండా జన్మించింది.. మరి డాక్టర్లు ఏంచేశారో తెలుసా..?

Woman Born Without Vagina Gets One From Fish
Highlights

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో మన వైద్యులు సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. అలాంటి ఓ సంఘటనే బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో మన వైద్యులు సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. అలాంటి ఓ సంఘటనే బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జూసీలెన్ మారినో (23 ఏళ్లు). పుట్టుకుతోనే ఈమెకు మర్మావయవాలు (యోని) లేవు. ట్రీట్‌మెంట్ కోసం అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఆమె సమస్యకు పరిష్కారం లభించలేదు.

కానీ బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సియారా (యూఎఫ్‌సి) వైద్యులు మాత్రం చివరకు మారినో సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టారు. అదేమిటంటే చేప చర్మంతో కృత్రిమ యోనిని తయారు చేసి అమర్చడం. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ, ఈ ఆపరేషన్ మాత్రం నూటికి నూరుపాళ్లు విజయవంతమైంది.

మారినోకి చికిత్స చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ లియోనార్డో బిజారా మట్లాడుతూ - ఆమె మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హ్యూసర్ (ఎమ్ఆర్‌కేహెచ్) అనే సమస్యతో భాద పడుతోందని (అంటే గర్భాశయం, అండాశయం లేకుండా పుట్టడం అని), కోట్లామందిలో కొందరికి మాత్రమే ఇలా జరుగుతుందని, ఇదొక జన్యుపరమైన లోపమే తప్పించి, దీని వలన పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.

ఈ ఆపరేషన్ కోసం ఫ్రెష్ వాటర్‌లో బ్రతికే తిలాపియా ఫిష్‌ను తీసుకొని, దానిపై చర్మాన్ని తొలగించి యోని ఉండాల్సిన చోట చిన్నపాటి రంధ్రం చేసి ఆ రంధ్రంలో ఈ చేప చర్మాన్ని అతికిస్తారు.  కొంత కాలానికి ఈ చేప చర్మం మనిషి చర్మంలా మారిపోతుందని, అస్సలు గుర్తు పట్టలేరని వైద్యులు చెబుతున్నారు. 

ఏదేమైనప్పటికీ, గతంలో తన సమస్య గురించి తెలుకుని మానసికక్షోభ అనిభవిస్తున్న మారినో మాత్రం ప్రస్తుతం అందరమ్మాయిల మాదిరిగానే సంతోషంగా ఉండటమే కాకుండా, తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంచక్కా శారీరక సంబధాన్ని కూడా ఎంజాయ్ చేసేస్తోందట.

loader