Asianet News TeluguAsianet News Telugu

Vladimir Putin : ప్లీజ్.. ఎక్కువ మంది పిల్లలను కనండి.. - రష్యన్ మహిళలకు అధ్యక్షుడు పుతిన్ అభ్యర్థన..

russia population : రష్యా జనాభా వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడి మహిళలకు కీలక అభ్యర్థన చేశారు. ప్రతీ ఒక్క మహిళ ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను కనాలని కోరారు. 

Vladimir Putin : Have more children.. - President Putin's request to Russian women..ISR
Author
First Published Dec 1, 2023, 5:29 PM IST

ఎక్కువ మంది పిల్లలను కనాలని రష్యన్ మహిళలకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభ్యర్థించారు. పెద్ద కుటుంబాలను ఏర్పాటు చేసి రష్యా జనాభాను పెంచాలని కోరారు. ఒక్క మహిళ దాదాపు 8 మంది సంతానాన్ని కలిగి ఉండాలని సూచించారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

Cyclone Michaung : ముంచుకొస్తున్న మైచౌంగ్ తుఫాన్.. ఎప్పుడు ? ఎక్కడ ? అది తీరం దాటనుందంటే..

రష్యా జననాల రేటు 1990ల నుండి పడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 3 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రష్యా జనాభాను పెంచడమే రాబోయే దశాబ్దాల్లో తమ లక్ష్యం అని పిలుపునిచ్చారు. 

Mitchell Marsh : అవకాశమస్తే వరల్డ్ కప్ ట్రోఫీపై మళ్లీ కాళ్లు పెడుతా.. తప్పేమున్నది - మిచెల్ మార్ష్

‘‘మన జాతి సమూహాలలో చాలా మంది నాలుగు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో బలమైన బహుళ తరాల కుటుంబాలను కలిగి ఉన్న సంప్రదాయాన్ని కాపాడుకున్నారు. రష్యన్ కుటుంబాలు, మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మందికి ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఈ అద్భుతమైన సంప్రదాయాలను కాపాడుకుందాం. పునరుజ్జీవింపజేద్దాం. పెద్ద కుటుంబాలు ప్రమాణంగా మారాలి. ఈ విధానం. కుటుంబం అనేది రాష్ట్రానికి, సమాజానికి పునాది మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక దృగ్విషయం, నైతికతకు మూలం’’ అని తెలిపారు.

webcam in ladies bathroom : లేడీస్ బాత్ రూమ్ లో వెబ్ క్యామ్.. ప్రియుడు చెప్పాడనే ప్రియురాలి దురాగతం..

‘‘రాబోయే దశాబ్దాలు, భవిష్యత్ తరాలకు కూడా రష్యా జనాభాను సంరక్షించడం, పెంచడమే మన లక్ష్యం’’ అని పుతిన్ అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ - రష్యాకు యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరువైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల రష్యా నుంచి లక్షలాది మంది పారిపోయారని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా కూడా తీవ్రమైన శ్రామిక శక్తి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది.

KCR : రెండు రోజులు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే - కేసీఆర్

కాగా.. అక్కడి అధికారిక లెక్కల ప్రకారం 2023 జనవరి నాటికి రష్యా జనాభా  146,447,424గా ఉంది. అయితే 1999లో పుతిన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఉన్న సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు జనాభా తగ్గిందని ‘ఇండిపెండెంట్’ పేర్కొంది. ఈ పరిస్థితితుల నేపథ్యంలోనే దేశ జనాభాను వేగంగా పెంచాలని అధక్షుడు పుతిన్ భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios