అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్‌ డీసీ లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు.ఈ కాల్పుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.

అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్‌ డీసీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగుల పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేపిటల్‌ జెవిష్‌ మ్యూజియం సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి అతి సమీపంగా వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు.

చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు ప్రీ పాలస్తీనా నినాదాలు చేశారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్‌ రాయబారి డానీ డానన్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నట్లు అధకారులు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నివసించే వాషింగ్టన్‌ డీసీ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి చోట ఉగ్రదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

 

Scroll to load tweet…

 

కాల్పుల గురించి సమాచారం అందిన వెంటనే వాషింగ్టన్ డీసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మ్యూజియం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు భద్రపరుస్తున్నారని, సాక్షుల కోసం, నిఘా ఫుటేజీ కోసం వెతుకుతున్నారని ఒక పోలీసు ప్రతినిధి తెలిపారు.

నిందితుడి అరెస్ట్ 

కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు మ్యూజియం లోపల అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఈ ఘటనను ఖండించారు, దీనిని "రెడ్ లైన్ దాటడం" అని అన్నారు. Xలో ఒక పోస్ట్‌లో ఆయన ఇలా అన్నారు, "వాషింగ్టన్ డీసీలోని జ్యూయిష్ మ్యూజియంలో జరిగిన కార్యక్రమం బయట జరిగిన కాల్పులు యూదు వ్యతిరేక ఉగ్రవాద చర్య."

ఆయన ఇంకా ఇలా అన్నారు, "యూదు సమాజానికి హాని చేయడం అంటే రెడ్ లైన్ దాటడమే. ఈ నేర చర్యకు బాధ్యులైన వారిపై యుఎస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని మేం నమ్ముతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా తన పౌరులను, ప్రతినిధులను రక్షించడానికి ఇజ్రాయెల్ దృఢంగా వ్యవహరిస్తూనే ఉంటుంది."