OSINT డిస్కషన్స్ ప్రకారం, C-130 విమానం పాకిస్తాన్ UAV ఫ్లీట్ కోసం అత్యవసరమైన  ఆయుధాలను తీసుకెళ్తుండొచ్చనే థియరీ బలంగా ఉంది. పాకిస్తాన్ తమ డ్రోన్ కార్యకలాపాలను సరిహద్దుల వద్ద పెంచుతోంది. టర్కీ Bayraktar TB2 Anka డ్రోన్లను ఇప్పటికే పాకిస్తాన్‌కు సరఫరా చేసింది, తద్వారా పాక్, టర్కీల మధ్య రక్షణ సంబంధాలు బలపడ్డాయి.

పెహెల్గాం అటాక్ తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టర్కీ నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 28, 2025న, టర్కిష్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఒక విమానం అరేబియన్ సముద్రం పైన ఎగురుతుండగా ADS-B ఎక్స్చేంజ్ అనే ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ద్వారా గుర్తించబడింది. 68-01606 అనే రిజిస్ట్రేషన్ నంబర్, TUAF509 అనే కాల్‌సైన్‌తో ఈ విమానం 14:20:11Z (UTC) సమయంలో 4701 అనే స్క్వాక్ కోడ్‌తో డిటెక్ట్ అయింది.

ఈ విమానం తీసుకున్న అసాధారణమైన రూట్, ప్రత్యేకించి అది పాకిస్తాన్‌లోని కరాచీ వైపు దూసుకెళ్తుండటం, చాలామందిలో ఆసక్తిని రేపింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) విశ్లేషణలు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఈ విమానం పాకిస్తాన్ UAV ఫ్లీట్ కోసం అత్యవసరంగా ఆయుధాలు సరఫరా చేస్తోందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

టర్కీ మిలిటరీ విమానం అరేబియన్ సముద్రం పైన కనిపించడం అంత సాధారణం కాదు కాబట్టి ఇది మరింత హైలైట్ అయింది. C-130 హర్క్యులీస్ నాలుగు ఇంజిన్లతో పనిచేసే టర్బోప్రాప్ విమానం, దీని ప్రధాన పని సైనికులకు ఆయుధాలు చేరవేయడం.

ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్స్ (ఉదా: ADS-B ఎక్స్చేంజ్) వంటి వాటి ద్వారా విమానాలను రియల్ టైమ్‌లో గుర్తించొచ్చు. TUAF509 అనే ఈ విమానం ప్రయాణ దిశను గమనించిన OSINT విశ్లేషకుల ప్రకారం, ఇది కరాచీ వైపు వెళ్తున్నట్లు కన్పించింది — ఇది పాకిస్తాన్ మిలిటరీ లాజిస్టిక్స్‌కు ఒక కీలక కేంద్రం. అధికారికంగా నిర్ధారణ కాకపోయినా, ఈ ప్రయాణ మార్గం టర్కీ-పాకిస్తాన్ మధ్య బలపడుతున్న డిఫెన్స్ సహకారాన్ని చూపుతోందని నిపుణులు భావిస్తున్నారు.

OSINT డిస్కషన్స్ ప్రకారం, C-130 విమానం పాకిస్తాన్ UAV ఫ్లీట్ కోసం అత్యవసరమైన ఆయుధాలను తీసుకెళ్తుండొచ్చనే థియరీ బలంగా ఉంది. పాకిస్తాన్ తమ డ్రోన్ కార్యకలాపాలను సరిహద్దుల వద్ద పెంచుతోంది. టర్కీ Bayraktar TB2 Anka డ్రోన్లను ఇప్పటికే పాకిస్తాన్‌కు సరఫరా చేసింది, తద్వారా పాక్, టర్కీల మధ్య రక్షణ సంబంధాలు బలపడ్డాయి.

అరేబియన్ సముద్రంలో పరిస్థితి కూడా కాస్త సున్నితంగా మారింది. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా టెన్షన్స్ నడుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం వారి పశ్చిమ సరిహద్దు (ఆఫ్ఘనిస్తాన్‌తో) వద్ద కౌంటర్ టెరరిజం ఆపరేషన్స్‌ను మరింత ముమ్మరం చేసే అవకాశముందని ఊహించొచ్చు. కానీ, ఇప్పటివరకు టర్కీ లేదా పాకిస్తాన్ అధికారికంగా ఈ విమాన ప్రయాణం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.