Asianet News TeluguAsianet News Telugu

మేఘాలయాలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరతారని ఊహాగానాలు..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేఘాలయాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే రోజు రాజీనామా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. 

Three MLAs resign in Meghalaya, will join BJP
Author
First Published Nov 29, 2022, 8:40 AM IST

షిల్లాంగ్ : మేఘాలయాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే తమకు అనుగుణంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకేరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం కలకలం రేపింది. మేఘాలయా కు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది రాజకీయంగా సంచలనం రేపింది. ఎన్ పీపీ శాసనసభ్యులు బెనెడిక్ మరాక్, ఫెర్లిన్ సంగ్మా, టిఎంసి ఎమ్మెల్యే షాంగ్ ప్లియాంగ్ లు ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించారు. 

అయితే, రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా తరువాత అనేక ఊహాగానాలు వినిపిస్తున్ాయి. వీరు వచ్చేనెలలో బీజేపీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్ కు రాజీనామా పత్రాలు పంపించారని.. మేఘాలయ అసెంబ్లీ కార్యదర్శి ఆండ్రూ సైమండ్స్ తెలిపారు. దీంతోపాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తమ తమ పార్టీల సభ్యత్వాన్ని కూడా వదిలేశారని సమాచారాం. 

ఎన్ పీపీ నేతృత్వంలోని మేఘాలయా డెమోక్రటిక్ అలయెన్స్ లో బీజేపీ మిత్రపక్షం. వచ్చే నెలలో ఈ మిత్రపక్షంలో ఈ నాయకులు  చేరవచ్చని ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. కాగా, వీటికి బలం చేకూరుస్తూ.. రాజీనామా చేసిన నేతలకు బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేఘాలయ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించే ఏకైక పార్టీ బిజెపి అన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు గ్రహించారని సదరు బీజేపీ నేత తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మేఘాలయాలో ఎన్నికలు జరగనున్నాయి. 

అస్సాం-మేఘాలయ సరిహద్దు వివాదం: ఆరు రోజులుగా చల్లారని ఉద్రిక్తతలు.. పలు చోట్ల 144 సెక్షన్ అమలు..

ఇదిలాఉండగా మేఘాలయా డెమోక్రటిక్ అలయెన్స్ ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించిన నేషనల్ పీపుల్స్ పార్టీతో సంబంధాలు తెగిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని అక్టోబర్ 11న ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేఘాలయాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ బిజెపి ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ మావ్రీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. 

దీనికి ఇంకా ఐదు నెలల కంటే తక్కువ సమయం ఉంది. కానీ, దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నందువల్ల రాబోయే ఎన్నికల్లో మేఘాలయాలో బిజెపి బాగా రాణిస్తుంది’ అని మీడియాతో అన్నారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని దీనికి అనుగుణంగా పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. 

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఇద్దరు మహిళా అభ్యర్థులతో సహా 47 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. గత నెలలో రాష్ట్ర బిజెపి నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం నుండి మద్దతు ఉపసంహరించుకోవాలని బెదిరించారు. కానీ ఆ సమయంలో పార్టీ విభజన నిర్ణయంపై మౌనంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios