పలు సందర్బాల్లో భారత్ ను కొనియాడిన శ్రీలంక తాజాగా భారత్ సహాయాన్ని గుర్తు చేసుకుంది. తమ దేశానికి ఇండియా మాత్రమే క్రెడిట్ లైన్ అందించిందని తెలిపింది. 

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక మరోసారి మ‌న దేశాన్ని కొనియాడింది. త‌మ‌కు క్రెడిట్ లైన్ లైన్ అందించిన ఏకైక దేశం భార‌త్ అని చెప్పింది. ఈ విష‌యాన్ని శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర శనివారం మీడియాతో తెలిపారు. తమ దేశం వివిధ దేశాలకు ఇంధనం కోసం అభ్యర్థనలు చేసిందని చెప్పారు. ‘‘ మాకు సహాయం చేయడానికి ఏ దేశం వచ్చినా మేము దానిని అభినందిస్తున్నాం. ప్రస్తుతం మాకు క్రెడిట్ లైన్‌ను అందించింది భారత ప్రభుత్వం మాత్రమే’’ అని విజేశేఖర వార్తా సంస్థ ANI తో అన్నారు. 

Parliament Session: పార్లమెంట్ సమావేశాలు.. 24 బిల్లుల‌ను తీసుకొచ్చేందుకు సిద్ధ‌మైన కేంద్రం

రష్యా ప్రభుత్వంతో శ్రీలంక చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు. ‘‘ ప్రారంభ సమావేశాలు రష్యాలో జరిగాయి. మేము మా అవసరాలను చెప్పాం. మేము దానిపై పని చేస్తున్నాం. ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తారో మేము వినేందుకు వెయిట్ చేస్తున్నాం ’’ అని ఆయన అన్నారు. 

Scroll to load tweet…

స్వతంత్రం పొందిన నాటి నుంచి ఎప్పుడూ ఎదుర్కోని ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. ముఖ్య‌మైన ఇంధనం, వంటగ్యాస్, ఆహార పదార్థాలు వంటి కొర‌త‌ను ఎదుర్కొంటోంది. ఎందుకంటే వాటిని దిగుమతి చేసుకోవడానికి తగినంత ఫారెక్స్ నిల్వలు లేవు. శ్రీలంకలో సంక్షోభం తీవ్రతరం కావడంతో భారతదేశం మానవతా ధృక్పథంతో సరుకులను తరలించింది. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు భారతదేశం ఇప్పటివరకు 3.8 బిలియన్ డాలర్లకు పైగా సహాయం అందించిందని MEA ఇటీవల తెలియజేసింది.

ఆల‌యంలోకి ఆవు మాంసం విసిరిన అల్ల‌రి మూక‌లు.. దుకాణాల‌కు నిప్పు పెట్టిన ఆందోళ‌న‌కారులు

కరెన్సీ మార్పిడులు, ఆసియా క్లియరింగ్ యూనియన్ మెకానిజం కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శ్రీలంక అప్పుల‌ను వాయిదా వేయ‌డం, ఇంధనం, ఆహారం, మందులు, ఎరువులు కోసం USD 1.5 బిలియన్లకు పైగా క్రెడిట్ సహాయం రూపంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కేంద్ర ప్ర‌భుత్వం అందించింది. 

ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ వ్యాప్తి.. పందుల‌ను చంపేస్తున్న అధికారులు !

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఇటీవల కొలంబోకు భారత్ చేసిన సహాయాన్ని ప్రశంసించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘‘ మన దేశానికి పొరుగు దేశం, పెద్ద సోదరుడు అయిన భారత్ ఎప్పుడూ సాయం చేస్తుంది. మేము భారత ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రస్తుత దృష్టాంతంలో మాకు మనుగడ సాగించడం అంత సులభం కాదు. భారతదేశం, ఇతర దేశాల సహాయంతో దీని నుండి బయటపడాలని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.