వార్నీ.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేసిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?
జీతం ఇవ్వలేదనే కారణంతో ఓ మంత్రినే అతడి బాడీగార్డ్ కాల్చి చంపాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలా నివాసంలో చోటు చేసుకుంది. అనంతరం అతడు కూడా కాల్చుకొని చనిపోయాడు.
చాలా కాలం నుంచి జీతం ఇవ్వడం లేదని ఓ మంత్రిని అతడి బాడీగార్డే కాల్చి చంపాడు. ఈ ఘటన ఉగాండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సైన్యం, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్య ఓ ప్రైవేట్ వివాదంలో జరిగింది. బాధితుడు చార్లెస్ ఎంగోలా రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన ప్రెసిడెంట్ యోవేరి ముసెవేని ప్రభుత్వంలో కార్మిక శాఖకు జూనియర్ మంత్రిగా పనిచేస్తున్నాడు.
మంత్రి ఉగాండా రాజధాని కంపాలా శివారులోని ఎంగోలా ఇంటిలో ఉన్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం అతడు కూడా కాల్చుకొని చనిపోయాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ.. గార్డుకు మంత్రికి వేతనాలపై వివాదం ఉందని స్థానిక ప్రెస్ నోట్ పేర్కొంది.
ఒక మంత్రిగా ఉన్నప్పటికీ తనకు చాలా కాలంగా జీతాలు ఇవ్వలేదని బాడీ గార్డు ఆందోళన చెందుతున్నాడని, అందుకే అతడు ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఆన్ లైన్ వార్తాపత్రిక ‘నైల్ పోస్ట్’ నివేదించింది. కాగా.. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో జరిగిన తుపాకీ దాడుల్లో ఉన్నత స్థాయి అధికారులు మరణించారు. అయితే ఓ మంత్రి ఇలా చనిపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటన దేశంలో ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది.
బజరంగ్ పూనియా ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు - బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన ఆరోపణలు
ఈ కాల్పులపై ఆర్మీ ప్రతినిధి బ్రిగ్ స్పందిస్తూ.. ఇది దురదృష్టకర సంఘటన అని అన్నారు. మేము ఈ విషయంపై సంయుక్తంగా దర్యాప్తు జరిపినప్పుడు ప్రజలకు వివరాలు తెలియజేస్తామని ట్వీట్ చశారు. కాగా.. 2021లో కంపాలాలో ఓ వాహనంపై ముగ్గురు తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో మాజీ ఆర్మీ చీఫ్ గాయపడ్డారు. అతడి కుమార్తె మరణించారు.