బజరంగ్ పూనియా ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు - బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన ఆరోపణలు
తనను ఇరికించాలనే ఉద్దేశంతో రెజ్లర్ బజరంగ్ పూనియా ఓ వ్యక్తితో అమ్మాయిని ఏర్పాటు చేయాలని చెప్పాడని, దానికి సంబంధించిన ఆడియో క్లిప్ తన ఉద్ద ఉందని ఆరోపించారు. ఆ క్లిప్ దర్యాప్తు కమిటీకి అందజేశానని తెలిపారు.
రెజ్లర్ బజరంగ్ పూనియా తనను ఇరికించడానికి ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు. తనను ఇరికించడానికి కుట్ర పన్నాడని, దాని కోసం ఓ అమ్మాయిని ఏర్పాటు చేయాలని పూనియా అడుగుతున్న ఓ ఆడియో తనకు దొరికిందని, దానిని విచారణ కమిటీకి ఇచ్చానని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
దేశ వనరులు ఎవరికీ చేరుతున్నాయో తెలియడం లేదు.. అందుకే దేశవ్యాప్త ఎన్ఆర్సీ అవసరం - హిమంత బిశ్వ శర్మ
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా తనను రాజీనామా చేయలని కోరితే తాను పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన మరుసటి రోజే డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్.. తనపై వస్తున్న ఆరోపణల గురించి ప్రధాని మోడీతో మాట్లాడలేదని చెప్పారు.
కాంగ్రెస్ నేత దీపేందర్ హుడా, స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా కుట్ర పన్నారన్న తన వాదనను తోసిపుచ్చిన సింగ్.. ఒక అమ్మాయిని ఏర్పాటు చేయాలని పునియా ఓ వ్యక్తిని కోరినట్లుగా ఉన్న ఆడియో క్లిప్ ను తాను దర్యాప్తు కమిటీకి సమర్పించానని చెప్పారు. మూడు నెలల తర్వాత వారు దాన్ని ఏర్పాటు చేసుకొని కొత్త ఆరోపణతో వచ్చారని తెలిపారు. షాహీన్బాగ్ (సీఏఏ వ్యతిరేక నిరసనలు), రైతుల నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన శక్తులు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
బ్రేకింగ్ : తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా హతం.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఘటన
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా రాజీనామా చేయాలని రెజ్లర్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సింగ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తోసిపుచ్చారు. రెజ్లర్లకు డబ్బులు ఇచ్చి నిరసన చేయిస్తున్నారని అన్నారు. తీవ్ర ఆరోపణలు చేసిన మైనర్ ఎవరో కూడా తనకు తెలియదని, ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ ముందు బాలిక కనీసం వాగ్మూలం కూడా ఇవ్వలేదని అన్నారు.
నిరసనల కారణంగా గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ‘నన్ను ఉరి తీయండి, కానీ రెజ్లింగ్ కార్యకలాపాలను ఆపొద్దు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. క్యాడెట్ నేషనల్స్ ను ఎవరు ఏర్పాటు చేసినా అనుమతించండి..’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఆయన ఓ హిందీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజ్లర్లు ఉద్యమం రాజకీయ ప్రేరేపితమని అన్నారు.