పోర్న్ సైట్‌లో మ్యాథ్స్ క్లాస్‌లు.. ఏడాదికి రూ. 2 కోట్లు సంపాదిస్తున్న టీచర్
ఆ లెక్కల ఉపాధ్యాయుడు తన మ్యాథ్స్ లెస్సన్స్ వీడియోలను సామాజిక మాధ్యమాలతోపాటు నీలి చిత్రాల సైట్‌లలోనూ అప్‌లోడ్ చేశాడు. ఓ సైట్‌లో విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. దీంతో ఏడాదికి సుమారు రూ. 2 కోట్ల చొప్పున సంపాదిస్తున్నాడు. తైవాన్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ చాంగ్షు ఈ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలోనూ అప్‌లోడ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: పుర్రెకో బుద్ధి అన్నట్టు ఆ టీచర్ తాను బోధించిన వీడియోలు పోస్టు చేయడానికి నీలిచిత్రాల వెబ్‌సైట్‌ను ఎంచుకున్నాడు. కానీ, పోర్న్ సైట్‌లో తరగతులు ఎవరు చూస్తారనే సందేహం రావడం సహజం. అదీ మ్యాథ్స్ క్లాస్‌లు ఛస్తే చూడరని కొందరు అభిప్రాయపడవచ్చు. కానీ, తైవాన్ టీచర్ అవేమీ పట్టించుకోలేదు. కొందరు అలాగే ఉంటారు.. సాధారణ అభిప్రాయాలు పక్కనపెట్టి అద్భుతాలు సృష్టిస్తారు. ఈ తైవాన్ టీచర్ కూడా అలాంటి వ్యక్తే. ఓ పోర్న్ సైట్‌లో తన మ్యాథ్స్ క్లాస్‌లు రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేశాడు. ఏడాదికి రూ. 2 కోట్ల మేరకు సంపాదిస్తున్నాడు.
తైవాన్ మ్యాథ్స్ టీచర్ చాంగ్షు ఓ పోర్న్ సైట్‌లో వెరిఫైడ్ అకౌంట్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఆ అకౌంట్ ద్వారానే తన మ్యాథ్స్ క్లాసెస్ అప్‌లోడ్ చేశారు. అయితే, ఆ వెబ్‌సైట్‌లలోనూ ఆయన మ్యాథ్స్ క్లాసులకు విశేష ఆదరణ లభించడం గమనార్హం. కొందరు తమ అకాడమీ విషయంలో అసలే వెనక్కి తగ్గరని అర్థమవుతున్నది. మ్యాథ్స్ నైపుణ్యాలను మరింత సానబెట్టడానికి వారికి ఏ ప్లాట్‌ఫామ్ అనేది అనవసరమనీ అవగతమవుతున్నది. దీనిపై తైవాన్ మ్యాథ్స్ టీచర్ చాంగ్షు ఈ విధంగా చెప్పుకొచ్చారు.
Also Read: నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు
మ్యాథ్స్ టీచర్ చాంగ్షు గ్లాసెస్ పెట్టుకుని గ్రీన్ బోర్డుపై కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. ఆ వెబ్‌సైట్‌కు వచ్చేవారందరికీ తన వీడియోలపై ఆసక్తి ఉండకపోవచ్చునని, కానీ, అడల్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లోనూ ఓ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడనే విషయం వారికి తెలుస్తుంది కదా అని నింపాదిగా చెప్పారు. కొందరైతే తన వీడియోల కోసమే ఆ సైట్‌కు వస్తున్నట్టు వివరించారు. తన కష్టమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియోల కోసమే నేరుగా వచ్చేవారున్నారని పేర్కొన్నారు. అసలు ఆ సైట్‌లో తాను మ్యాథ్స్ బోధించాలనే భావించలేదని, కానీ, తైవాన్‌తో ఓ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడని, ఆయన గణితం బాగా చెబుతాడని ప్రపంచానికి తెలియాలని ఆశపడ్డట్టు తెలిపారు. ఆ వెబ్‌సైట్‌లో మ్యాథ్స్ లెస్సన్స్ ద్వారా ఏడాదికి 2.5 లక్షల అమెరికన్ డాలర్లు సంపాదిస్తున్నట్టు వివరించారు.
చాంగ్షు వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలోనూ విరివిగా ఉన్నాయి. కాబట్టి, ఆయన మ్యాథ్స్ వీడియోలు చూడాలనుకుంటే అడల్ట్ సైట్‌కు వెళ్లాల్సిన పనిలేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ చూడవచ్చు.