శ్రీలంక పేలుళ్లు: ఒక చోట తప్పించుకున్నా.. మరోచోట బలి

అదృష్టం బాగుంటే కొన్నిసార్లు ఘోర ప్రమాదాల నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చు. అదే దురదృష్టం వెంటాడితే చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. శ్రీలంకలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లలో ఇద్దరు తోబట్టువులు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు

srilanka blasts: britain siblings died in multiple bomb blastings in colombo

అదృష్టం బాగుంటే కొన్నిసార్లు ఘోర ప్రమాదాల నుంచి కూడా ప్రాణాలతో బయటపడొచ్చు. అదే దురదృష్టం వెంటాడితే చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. శ్రీలంకలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లలో ఇద్దరు తోబట్టువులు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు.

వారిద్దరూ ఒక పేలుడు ఘటన నుంచి తప్పించుకున్నప్పటికీ తాజాగా కొలంబోలో జరిగిన పేలుళ్లలో చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన డేనియల్, అతని సోదరి అమీలి తమ తల్లిదండ్రులతో కలిసి విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వచ్చారు.

పేలుళ్లు జరిగిన రోజే వారి విహారయాత్ర ముగిసింది. దీంతో వారు తమ స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో డేనియల్ కుటుంబం టేబుల్ వన్ కెఫేలో కూర్చొని అల్పాహారం తీసుకుంటుండగా పేలుడు సంభవించింది.

అదృష్టవశాత్తూ వీరి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. అక్కడి నుంచి తలదాచుకునేందుకు కొలంబోలోని షాంఘ్రి లా హోటల్‌కు వెళ్లారు. పాపం దురదృష్టం వెంటాడటంతో అక్కడ మరో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో అన్నాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించారు. దీంతో డేనియల్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios