Asianet News TeluguAsianet News Telugu

నైకీలో 1,600 మందికిపైగా ఉద్యోగుల కోత.. ఎందుకంటే ?

స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైకీ తమ ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 1,600 మందికి పైగా ఉద్యోగాలను తీసి వేసి, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ కంపెనీలో 83,700 మంది పని చేస్తున్నారు.

Sportswear giant Nike has decided to lay off more than 1,600 employees..ISR
Author
First Published Feb 16, 2024, 1:55 PM IST

స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైకీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ ఉద్యోగుల్లో రెండు శాతం లేదా 1,600 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాస్ట్-కట్టింగ్ చర్యలపై ఉద్యోగులకు సీఈవో సందేశం పంపించారు.

మంచి నిర్ణయమే.. కానీ చాలా లేటైంది - అసదుద్దీన్ ఒవైసీ

రన్నింగ్, మహిళల దుస్తులు, జోర్డాన్ బ్రాండ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను పెంచడానికి కంపెనీ తన వనరులను ఉపయోగిస్తోందని ఉద్యోగులకు అంతర్గత మెమోలో నైక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ డోనాహో తెలిపారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ‘‘ఇది బాధాకరమైన వాస్తవం. నేను ఇది తేలికక తీసుకోవడం లేదు. కానీ మనం ప్రస్తుతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం లేదు. కానీ చివరికి నా నాయకత్వ బృందం చెప్పిన దానికి బాధ్యత వహిస్తాను.’’ అని  డోనాహో మెమోలో పేర్కొన్నారు.

ఈ నివేదిక ప్రకారం.. స్టోర్లు, డిస్ట్రిబ్యూట్ సౌకర్యాలలోని కార్మికులు, కంపెనీ ఇన్నోవేషన్ బృందంలో పని చేసే వారిని తొలగించే అవకాశం లేదు. కాగా.. మే 31, 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 83,700 మంది కార్మికులు కంపెనీలో శుక్రవారం నుంచి కోతలు ప్రారంభమవుతాయని, ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి రెండో దశ పూర్తవుతుందని తెలుస్తోంది.

మహాలక్ష్మి ఎఫెక్ట్.. బస్సుల్లో సీట్ల అమరికను మార్చేసిన ఆర్టీసీ.. ఎందుకో తెలుసా ?

ఇదిలా ఉండగా.. వచ్చే మూడేళ్లలో 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను ఆదా చేస్తామని గత ఏడాది డిసెంబర్ లో నైకీ ప్రకటించిన తర్వాత ఉద్యోగాల కోత ప్రకటన వెలువడింది. పొదుపు సాధించడానికి తమ సంస్థను క్రమబద్ధీకరిస్తామని కంపెనీ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే నవంబర్ 30 నాటికి అమ్మకాలు కేవలం ఒక శాతం మాత్రమే పెరిగాయని, నైకీ అతిపెద్ద మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో పాదరక్షల అమ్మకాలు ఐదు శాతం పడిపోయాయని కంపెనీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios