Asianet News TeluguAsianet News Telugu

మహాలక్ష్మి ఎఫెక్ట్.. బస్సుల్లో సీట్ల అమరికను మార్చేసిన ఆర్టీసీ.. ఎందుకో తెలుసా ?

మహాలక్ష్మీ పథకం (mahalaxmi scheme) విజయవంతంగా కొనసాగుతోంది. దీని వల్ల పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రద్దీ పెరిగింది. అయితే సిటీ బస్సులు కూడా నిండుగా వెళ్తున్నాయి. దీంతో మరింత మందికి ప్రయాణం కల్పించే విధంగా బస్సుల్లో సీట్ల అమరికను టీఎస్ ఆర్టీసీ (TS RTC) గ్రేటర్ హైదరాబాద్ జోన్ మార్చింది.

Mahalakshmi effect.. TSRTC has changed the seating arrangement in buses..ISR
Author
First Published Feb 16, 2024, 10:06 AM IST | Last Updated Feb 16, 2024, 10:06 AM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మీ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే ఈ పథకం వల్ల టీఎస్ ఆర్టీసీకి గతంతో పోలిస్తే భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. ప్రారంభంలో అడపా దడపా ఇబ్బందులు ఎదురైనా.. ఇప్పుడు విజయవంతంగా ఈ ఉచిత సర్వీస్ కొనసాగుతోంది. బస్సులన్నీ మహిళలతో రద్దీగా వెళ్తున్నాయి.

నేడు భారత్ బంద్.. కారణమేంటంటే ?

మహాలక్ష్మీ పథకంలో భాగంగా పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం పొందవచ్చు. దీంతో ఆ బస్సులన్నీ అధికంగా మహిళా ప్రయాణికులతోనే నిండిపోతున్నాయి. సిటీ బస్సుల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే సిటీ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే వారే ఎక్కువగా ఉంటారు. దీంతో అధికంగా బస్సుల్లో నిలబడే వారే ఎక్కువ ఉంటారు. మహాలక్ష్మీ పథకం వల్ల బస్సులన్నీ రద్దీగా మారుతుండటంతో చాలా మందికి నిలబడేందుకు కూడా స్థలం సరిపోవడం లేదు. 

దీంతో టీఎస్ ఆర్టీసీ దీనికి  ఓ పరిష్కారం కనుగొంది. మెట్రో రైలులో మాదిరిగా మధ్యలో నిలబడేందుకు అధికంగా స్థలం ఉండేట్టు, అటు, ఇటూ సీట్లు ఉండేలా చేయలని భావించింది. దీనిని ఇప్పటికే కొన్ని బస్సుల్లో అమల్లోకి తీసుకొచ్చింది. సీట్ల అమరికలో మార్పులు తీసుకొచ్చిన ఈ తరహా బస్సుల్లు ఇప్పుడు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. 

దీని వల్ల బస్సుల్లో కూర్చొని ప్రయాణించే వారి సంఖ్య తగ్గినా.. బస్సుల్లో మరింత ఎక్కువ మందికి ప్రయాణించే అవకాశం లభిస్తుంది. రద్దీ సమయాల్లో ఇది చాలా ఉపయోకరంగా ఉంటుంది. బస్సు నిండా సీట్లు ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటు ఉండటం లేదని భావించి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈ నిర్ణయం తీసుకుంది. మైట్రో రైల్ మాదిరిగా సిటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసింది. 

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మీ గ్యారెంటీ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ ఉచిత బస్సు హామీని అమలు చేస్తోంది. దీని వల్ల తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios