Asianet News TeluguAsianet News Telugu

లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు.. 10 మంది హతం.. పోలీసులు చుట్టుముట్టడంతో నిందితుడి ఆత్మహత్య..

అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. అయితే నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా..అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Shooting in Los Angeles.. 10 people killed.. Suspect commits suicide after being surrounded by police..
Author
First Published Jan 23, 2023, 10:48 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది హతమయ్యారు. అయితే నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు చుట్టుముట్టడంతో నిందితుడు వ్యాన్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ.. పోలీసులు నిందితుడిని గుర్తించి వ్యాన్‌లో చుట్టుముట్టారని, అయితే పోలీసులు అతడిని పట్టుకునేలోపు నిందితుడు వ్యాన్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నిందితుడిని 72 ఏళ్ల హు కాన్ ట్రాన్‌గా గుర్తించారు. 

అరక్కోణంలో ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. క్రేన్ కూలి నలుగురు మృతి, 9 మందికి గాయాలు..

కాల్పుల్లో అనుమానితులెవరూ లేరని లాస్ ఏంజెల్స్ పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడు లాస్ ఏంజెల్స్‌లోని బాల్‌రూమ్ డ్యాన్స్ క్లబ్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 10 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు.

ప్రియుడికోసం.. కట్టుకున్న భర్తను 26సార్లు తలమీద కొట్టి హత్య చేసి, పెట్రోల్ పోసి హతమార్చిన భార్య..

లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లోని మాంటెరీ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మాంటెరీ పార్క్‌లో దాదాపు 60,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఆసియా సంతతికి చెందినవారు. చాంద్రమానం పండుగ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఇది చైనా ప్రధాన పండుగ. రెండు రోజుల పాటు జరిగే ఈ పండుగ శనివారం నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా నిందితుడు డ్యాన్స్ క్లబ్‌లో కాల్పులు జరిపాడు. 10 మందిని హతమార్చాడు.

ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయమైన స్నేహితుడు.. కలుద్దామని పిలిచి యువతిపై ఆరునెలలుగా అత్యాచారం..

ఈ నెలలోనే అమెరికాలో కాల్పుల ఘటన ఇది ఐదోది. టెక్సాస్‌లోని ఉవాల్డే ప్రాంతంలో పాఠశాలలో కాల్పులు జరిగిన తర్వాత ఇది అత్యంత ఘోరమైన ఘటన. ఉవాల్డే ఘటనలో 21 మంది చనిపోయారు. ఇంతకు ముందు కొలరాడోలోని స్ప్రింగ్ నైట్‌క్లబ్‌లో కాల్పుల ఘటన జరిగింది. ఇందులో 5 మంది మరణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios