ఇన్ స్ట్రాగ్రాంలో పరిచయమైన స్నేహితుడు.. కలుద్దామని పిలిచి యువతిపై ఆరునెలలుగా అత్యాచారం..
స్నేహితుడే కదా అని నమ్మి వెడితే ఓ యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

ఢిల్లీ : సోషల్ మీడియా స్నేహాలు అమ్మాయిల రక్షణకు ముప్పుగా మారుతున్నాయి. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో స్నేహాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలో ఎన్నో బయటపడుతున్నా.. కొంతమంది యువతులు తెలిసి తెలిసి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ముక్కు, మొహం, ప్రాంతం, వ్యక్తిగత వివరాలు ఏమీ తెలియని వ్యక్తి వలలో పడి మోసపోతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువతి ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమైన స్నేహితుడు చేతిలో మోసపోయింది. చివరికి అతడి వలలో చిక్కుకొని ఆరు నెలలుగా అత్యాచారానికి గురవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో పరిచయమయ్యింది. అది స్నేహంగా మారింది. దీంతో వీరిద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. అతను చెప్పిన చోటుకు వెళ్ళింది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తర్వాత సదరు స్నేహితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో షాక్ అయిన యువతి ఎదురు తిరిగింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అలా ఆరు నెలలుగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఫ్రమ్ ది ఇండియా గేట్: ఓటు విలువ, అనువాదంతో తలనొప్పి, రాయల్టీ వర్సెస్ లాయల్టీ..
20 ఏళ్ల ఢిల్లీకి చెందిన ఓ యువతీకి జైపూర్ కు చెందిన రషీద్ అనే వ్యక్తితో ఇంస్టాగ్రామ్ లో ఆరు నెలల క్రితం పరిచయమైంది. అది స్నేహంగా మారి.. ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలా ఓ నెల రోజుల తర్వాత రషీద్ ఆమెను ఓ కెఫేకు రమ్మని ఆహ్వానించాడు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి.. నెల రోజులుగా తనతో గంటలకొద్దీ మాట్లాడుతూ నమ్మకాన్ని పొందిన వ్యక్తి.. కావడంతో ఆమె అక్కడికి వెళ్ళింది.
అక్కడ రషీద్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఎదురుతిరగడంతో.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో ఆయువతి సరేనని ఒప్పుకుంది. ఆ తర్వాత కూడా రషీద్ అనేకసార్లు పెళ్ళి చేసుకుంటాను కదా అని... యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తనకు ఇచ్చిన మాట ప్రకారం తనను పెళ్లి చేసుకోవాలని యువతి అతడి మీద ఒత్తిడి చేసింది. అప్పుడు రషీద్ తన అసలు రంగు బయట పెట్టాడు. ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పాడు. మొబైల్ నెంబర్ను బ్లాక్ చేశాడు. దీంతో అతను మోసం చేశాడని బాధితురాలికి అర్థమయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. వారు అతడి మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.