అమెరికాలోని అట్లాంటాలో కాల్పులు.. ముగ్గురు మృతి
అమెరికాలోని అట్లాంటాలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకరు టీనేజర్ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అమెరికాలో మళ్లీ కాల్పులు మోత కలకలం రేకెత్తించింది. జార్జియా రాజధాని అట్లాంటాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ టీనేజర్ సహా ముగ్గురు మృతి చెందారు. నైరుతి అట్లాంటాలోని ఎవాన్స్ స్ట్రీట్ లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఓ వ్యక్తి కాల్పుల్లో చనిపోయారని సమాచారం రావడంతో హోమిసైడ్ అధికారులను ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కానీ ఆ ప్రాంతంలో ముగ్గురు కాల్పుల్లో మరణించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతుల్లో అందరూ పురుషులే. అయితే వీరి వద్దకు ఓ దుండగుడు వచ్చి తన తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు.
భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి.. పిడుగుపడి ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి మరొకరు..
బాధితుల్లో ఒకరికి 17 ఏళ్లు, మరొకరికి 20 ఏళ్లు ఉండగా.. మరొకరికి వ్యక్తికి 30 ఏళ్లు. అయితే మృతి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా.. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ‘అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించింది.