Asianet News TeluguAsianet News Telugu

న్యూ మెక్సికోలో బైకర్ ల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి.. ఐదుగురికి గాయాలు

న్యూ మెక్సికోలో బైకర్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఈ కాల్పులకు కారణమైన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Shooting between bikers in New Mexico.. 3 dead.. 5 injured..ISR
Author
First Published May 29, 2023, 11:15 AM IST

అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో వార్షిక మెమోరియల్ డే సందర్భంగా నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఇందులో ప్రత్యర్థి బైకర్ ముఠాల మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) తెలిపారు.

మానవత్వం చూపించిన సీఎం సిద్ధరామయ్య.. హత్యకు గురైన బీజేపీ నేత భార్యకు మళ్లీ ఉద్యోగమిస్తామని ప్రకటన

న్యూ మెక్సికో స్టేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌంట్ రిసార్ట్ సిటీ రెడ్ రివర్ లో శనివారం బండిడోస్, వాటర్ డాగ్ ల మధ్య కాల్పులు జరిగాయి. న్యూ మెక్సికోలోని అతిపెద్ద నగరమైన అల్బుకెర్కీలో మరో ముఠాకు సంబంధించిన ఫొటోపై ఘర్షణ ప్రారంభమైందని, ఆ తర్వాత రెడ్ రివర్లో వార్షిక మెమోరియల్ డే మోటార్ సైకిల్ ర్యాలీకి వ్యాపించిందని న్యూ మెక్సికో స్టేట్ పోలీస్ చీఫ్ టిమ్ జాన్సన్ ‘రాయిటర్స్’ కు తెలిపారు.

సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

కాల్పుల్లో లాస్ లూనాస్ కు చెందిన ఆంథోనీ సిల్వా (26), సోకోరోకు చెందిన డామియన్ బ్రెక్స్ (46), అల్బుకెర్క్ కు చెందిన రాండీ శాంచెజ్ (46) మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. న్యూ మెక్సికోకు చెందిన వాటర్ డాగ్ జాకబ్ కాస్టిల్లో (30)పై పోలీసులు హత్యానేరం మోపగా, టెక్సాస్ కు చెందిన బండిడోస్ చాప్టర్ లీడర్ మాథ్యూ జాక్సన్ (39) అక్రమంగా తుపాకీని తీసుకెళ్లినట్లు అభియోగాలు మోపారు. టెక్సాస్ కు చెందిన మరో బండిడో నాయకుడు క్రిస్టోఫర్ గార్సియా (41)ను కొకైన్ కలిగి ఉన్నారనే అనుమానంతో అరెస్టు చేశారు. 

దారుణం.. ఇస్లాంలోకి మారాలని గర్భవతి అయిన సహజీవన భాగస్వామిపై ఒత్తిడి.. విషప్రయోగం చేయడంతో మృతి..

కాగా.. గత రెండు నెలల్లో ఓక్లహోమా, టెక్సాస్ లలో బాండిడోస్ మూడు కాల్పులకు పాల్పడినట్లు టిమ్ జాన్సన్ తెలిపారు. ఇదిలా ఉండగా.. సమీపంలోని ఏంజెల్ ఫైర్ లోని వియత్నాం వెటరన్స్ మెమోరియల్ వద్ద స్మృతి వేడుకలు, లైవ్ మ్యూజిక్ తో కూడిన మోటార్ సైకిల్ ర్యాలీకి దేశం నలుమూలల నుంచి సుమారు 28,000 మంది బైకర్లు హాజరవుతారని రాయిటర్స్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios