MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • భారీగా టాయిలెట్ పేప‌ర్ల‌ను కొనుగోలు చేస్తున్న అమెరిక‌న్లు.. అసలేం జరుగుతోంది?

భారీగా టాయిలెట్ పేప‌ర్ల‌ను కొనుగోలు చేస్తున్న అమెరిక‌న్లు.. అసలేం జరుగుతోంది?

USA: అమెరికాలో టాయిలెట్ పేపర్, జనరేటర్లు, ఆహార పదార్థాల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. టెక్నాలజీ అంతరాయాలు, భవిష్యత్తుపై ఆందోళనలతో ప్రజలు ముందుగానే అత్యవసర వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. అసలు అమెరికాలో అసలేం జరుగుతోంది?

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 25 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అత్యవసర వస్తువుల కొనుగోళ్లలో భారీ పెరుగుదల
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

అత్యవసర వస్తువుల కొనుగోళ్లలో భారీ పెరుగుదల

అమెరికాలో ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ (ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన ఆహారం), జనరేటర్లు, టాయిలెట్ పేపర్ వంటి వస్తువులకు డిమాండ్ పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ ఆన్‌లైన్ ధరలపై చేసిన విశ్లేషణ ప్రకారం.. సెప్టెంబర్ నుంచి ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ ధరలు 12 శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఈ ధరలు 9 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ ఉత్పత్తుల్లో మూడింట ఒక వంతుకు పైగా స్టాక్ అందుబాటులో లేదు. గతేడాది ఈ పరిస్థితి ప్రతి 16 ఉత్పత్తుల్లో ఒకదానికే పరిమితమైంది.

జనరేటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం జనరేటర్లలో స్టాక్ లేని ఉత్పత్తుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. పరిశీలించిన ఉత్పత్తుల్లో ఐదింట ఒక వంతుకు పైగా అందుబాటులో లేవు. టాయిలెట్ పేపర్ ధరలు సెప్టెంబర్ నుంచి 4 శాతం పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పరిశీలించిన ప్రతి 10 ఉత్పత్తుల్లో ఒకటి స్టాక్‌లో లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు ఉన్నా తగ్గని ధరలు
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు ఉన్నా తగ్గని ధరలు

సాధారణంగా అమెరికాలో నవంబర్ నెలలో బ్లాక్ ఫ్రైడే, సైబర్ మండే ఆఫర్ల కారణంగా చాలా వస్తువుల ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈసారి అత్యవసర వస్తువుల విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ధరలు తగ్గాల్సిన సమయంలో పెరుగుతున్నాయి. పేపర్ టవల్స్, బ్యాటరీలు, చెత్త సంచులు వంటి వస్తువులకు కూడా డిమాండ్ పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ ప్రకారం.. దుస్తులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా సుమారు 1,400 ఇతర ఉత్పత్తుల ధరలు ఇదే సమయంలో సగటున 1 శాతం తగ్గాయి. కానీ అత్యవసర వస్తువుల ధరలు మాత్రం పెరిగాయి. దీనికి ప్రధాన కారణం కొనుగోళ్లు పెరగడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి సరుకులపై సుంకాలు, ఇంధన ధరలు, ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపే ఇతర అంశాలు కూడా ధరల పెరుగుదలకు కారణం కావచ్చని పేర్కొన్నారు.

35
టెక్నాలజీ వ్యవస్థల్లో అంతరాయాలతో ప్రజల్లో ఆందోళన
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

టెక్నాలజీ వ్యవస్థల్లో అంతరాయాలతో ప్రజల్లో ఆందోళన

ఇటీవల అమెరికాలో పలు కీలక సేవలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. విమాన రాకపోకలు, బ్యాంకింగ్ సేవలు, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (NSA) కార్యకలాపాలకు సంబంధించిన వ్యవస్థల్లోనూ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజల్లో కీలక సేవలు ఎప్పుడైనా నిలిచిపోవచ్చనే ఆందోళన పెరిగింది.

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కంప్యూటర్ వ్యవస్థలకు ముప్పు ఏర్పడుతుందనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చని, పెద్ద ఎత్తున సంక్షోభం రావచ్చని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా 90 రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి భారీ విద్యుత్ అంతరాయం రాబోతుందనే విషయానికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు.

45
వాల్‌మార్ట్, కాస్ట్‌కోలోనూ పెరిగిన అత్యవసర వస్తువుల అమ్మకాలు
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

వాల్‌మార్ట్, కాస్ట్‌కోలోనూ పెరిగిన అత్యవసర వస్తువుల అమ్మకాలు

అమెరికాలోని ప్రముఖ రిటైల్ సంస్థలు కూడా ఈ కొనుగోళ్ల పెరుగుదలను గుర్తించాయి. వాల్‌మార్ట్, కాస్ట్‌కో వంటి సంస్థల్లో ప్రొపేన్ గ్యాస్, బాటిల్ వాటర్, క్యాంపింగ్ పరికరాలు, బియ్యం, క్యాన్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాల కొనుగోళ్లు పెరిగాయి. ట్రాక్టర్ సప్లై వంటి సంస్థల్లోనూ జనరేటర్లు, నీళ్లు, ప్రొపేన్ గ్యాస్ వంటి వస్తువులకు డిమాండ్ ఎక్కువైంది.

సోషల్ మీడియాలో విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితుల గురించి వస్తున్న పోస్టులు కూడా ఈ కొనుగోళ్లకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ముందుగానే ఆహారం, నీరు, విద్యుత్ అందించే పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఈ మార్పు ఆన్‌లైన్‌లోనూ కనిపిస్తోంది. 'క్యాజువల్ ప్రిప్పర్స్' అనే పాడ్‌కాస్ట్ సహ నిర్వాహకుడు కోబీ కూన్రాడ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 19తో ముగిసిన 30 రోజుల కాలంలో ఆ కార్యక్రమం డౌన్‌లోడ్లు 33 శాతం పెరిగాయి. అంటే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.

55
వినియోగదారుల విశ్వాసం కూడా పెరుగుతోంది
Image Credit : Gemini AIతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

వినియోగదారుల విశ్వాసం కూడా పెరుగుతోంది

ఇదిలా ఉంటే.. మరోవైపు అమెరికాలో వినియోగదారుల విశ్వాసం కూడా మెరుగుపడింది. కాన్ఫరెన్స్ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో 91.9గా ఉన్న వినియోగదారుల విశ్వాస సూచీ నవంబర్‌లో 103.3కు చేరింది. ఇది 2025 జనవరి తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితులపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగడం దీనికి కారణమని రాయిటర్స్ నివేదించింది. అయితే నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయంపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. అమెరికాలో అత్యవసర వస్తువుల కొనుగోళ్లు పెరగడానికి టెక్నాలజీ అంతరాయాలు, సోషల్ మీడియా ప్రచారాలు, భవిష్యత్తుపై అనిశ్చితి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వైరల్ న్యూస్
 
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
World's Coldest Village: ప్రపంచంలో అత్యంత చల్లని గ్రామం.. మైనస్ 67 డిగ్రీల చలిలో ఎలా బతుకుతున్నారు?
Recommended image2
Global Religion Report: 2035 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులు, హిందువుల సంగతేంటి?
Recommended image3
అమెరికాలో మరో తెలుగు రాష్ట్రం.. డ‌ల్లాస్‌, డ‌ల్లాస్‌పురంగా ఎలా మారిందో తెలుసా.?
Related Stories
Recommended image1
పాప్‌కార్న్‌ ఎందుకు పేలుతుందో ఆలోచించారా.? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఇదే
Recommended image2
హైవేలకు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మధ్య తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved