కొలంబో: బాంబు పేలుళ్లలో శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు  ఆమె కూతురు మృతి చెందారు. మరణించడానికి కొన్ని నిమిషాల ముందు  తన కుటుంబ సభ్యులతో తీసుకొన్న సెల్ఫీని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఆ ఫోటోను చూసిన పలువురు కన్నీరుమున్నీరౌతున్నారు.

శ్రీలంకలో ఆదివారం నాడు చోటు చేసుకొన్న బాంబు పేలుళ్లలో ప్రముఖ టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు ఆమె కూతురు మరణించారు. ఆదివారం నాడు షాంగ్రీల్లా హోటల్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఆమె బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో  సెల్పీ తీసుకొన్న ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోను ఫెస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఆమెతో పాటు ఆమె కూతురు కూడ బాంబు పేలుళ్లలో మరణించింది.

 మరణించడానికి ముందు కుటుంబసభ్యులతో శాంతా మయదున్నె తీసుకొన్న సెల్పీ ఫోటోను పోస్టు చేస్తూ ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు శాంతా స్నేహితురాలు రాధ తన ఆవేనను వ్యక్ం చేశారు. 

 శ్రీలంకలో లైవ్‌ టెలివిజన్‌ కుకింగ్‌ షో నిర్వహించిన మొదటి మహిళగా శాంత మయదున్నె నిలిచారు. తమ అభిమాన సెలబ్రిటీ దుర్మరణం పట్ల పలువురు ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు