Asianet News TeluguAsianet News Telugu

శాన్ మిగ్యుల్ టోటోలాపాన్‌లోని సిటీ హాల్ లో దుండగుల కాల్పులు.. 18 మంది మృతి, ముగ్గురికి గాయాలు

మెక్సికో దేశంలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాన్‌లోని సిటీ హాల్ సాయుధ బృందం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. 

San Miguel Totolapan city hall shot by thugs.. 18 dead and 3 injured
Author
First Published Oct 6, 2022, 11:07 AM IST

నైరుతి మెక్సికోలో దారుణం జరిగింది. శాన్ మిగ్యుల్ టోటోలాపన్ లోని సిటీ హాల్ పై, సమీపంలోని ఇళ్ల‌పై దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 18 మంది మ‌ర‌ణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరణించిన వారిలో ఆ సిటీ మేయ‌ర్ కూడా ఉన్నారు.

దుర్గాదేవి నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతి... ఆకస్మిక వరదల వల్ల పశ్చిమబెంగాల్ లో 8 మంది మృతి, పలువురి గల్లంతు..!

బుధవారం జరిగిన ఈ దాడుల్లో ఒక సాయుధ బృందం గురెరెరోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపన్ లోని సిటీ హాల్ లో మొద‌ట‌గా కాల్పులు ప్రారంభించింది. త‌రువాత స్థానికంగా ఉన్న ఓ నివాసంపై కాల్పులు జ‌రిపింది. అయితే ఘ‌ట‌నా స్థ‌లం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటోల్లో బయటి గోడలలో అనేక బుల్లెట్ రంధ్రాలు ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాయ‌ని BNO న్యూస్ నివేదించింది.

షాకింగ్.. ప్రియుడున్నాడని, వదిలేయమని చెప్పినా భర్త వినకపోవడంతో.. ఆ భార్య చేసిన పని..

ఈ ఘ‌ట‌న స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సమీపంలోని ఒక ఇంటికి వెళ్లారు, అక్కడ తుపాకీ కాల్పుల వ‌ల్ల చాలా మంది చ‌నిపోయార‌ని నిర్ధారించారు. ఆ బిల్డింగ్ ముందు దాదాపు ప‌ది మంది బాధితులు గుంపులు గుంపులుగా ఉన్నారు. వారి శ‌రీరాలపై ర‌క్త స్రావం జ‌రుగుతోంది. ఈ దృశ్యాల‌ను రికార్డ్ చేసి పోలీసులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై ఆ దేశ అధికార మోరెనా పార్టీ సభ్యుడు గెరెరో గవర్నర్ ఎవెలిన్ సల్గాడో పినెడా స్పందించారు. దీనిపై వెంట‌నే ద‌ర్యాప్తు ప్రారంభించాల‌ని రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయాన్ని కోరారు.  ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ఆ పార్టీ పేర్కొంది. బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌ర‌గాల‌ని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios