తీవ్రమైన కత్తి దాడిలో గాయపడిన రచయిత సల్మాన్ రష్దీ ఓ కంటి చూపును కోల్పొయారు. ఓ చేయి కూడా పని చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన సాహిత్య ఏజెంట్ ఓ మీడియా సంస్థతో తెలిపారు.
ముంబైలో జన్మించిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై గత నెలలో కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్ లో చేర్పించినా.. ఆయన చాలా రోజులు కోలుకోలేదు. అయితే ప్రస్తుతం ప్రాణాప్రాయం నుంచి కోలుకున్నారు. కానీ ఓ కంటి చూపును కోల్పొయాడు. ఓ చేయి కూడా పని చేయడం లేదు.
‘‘ది సాటానిక్ వెర్సెస్’’ పుస్తకాన్ని రచించిన తర్వాత ఇస్లామిస్ట్ మరణ బెదిరింపులను ఎదుర్కొన్న రష్దీని.. అమెరికా జాతీయుడైన లెబనీస్‌కు చెందిన 24 ఏళ్ల న్యూజెర్సీ నివాసి హదీ మాటర్ పొడిచాడు. వెస్ట్రన్ న్యూయార్క్‌లోని చౌటుక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో జరిగిన సాహిత్య కార్యక్రమంలో ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా ఈ దాడి జరిగింది.
విద్యార్థులకు పోర్న్ వీడియోలు పంపిన ప్రొఫెసర్.. సస్పెండ్ చేసిన యూనివర్సిటీ...
‘‘ రష్దీకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. కానీ ఆయన ఓ కంటి చూపును కోల్పోయాడు. ఆయన మెడలో మూడు తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అతడి చేతిలో నరాలు తెగిపోవడంతో ఒక చెయ్యి పని చేయడం లేదు. అతడి ఛాతీ, మొండెం ఇంకా 15 గాయాలున్నాయి. ’’ అని ఆయన సాహిత్య ఏజెంట్ ఆండ్రూ వైలీ స్పానిష్ భాషా వార్తాపత్రిక ఎల్ పాస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రష్దీ ఇంకా ఆసుపత్రిలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించినప్పుడు.. ఆయన ఆచూకీ గురించి తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని వైలీ చెప్పాడు. ఆయన తిరిగి జీవించబోతున్నాడని, ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పారు. కాగా.. సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
సిత్రాంగ్ తుఫాన్: ఏపీకి తప్పిన ముప్పు.. ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం.. తీరం దాటేది ఎక్కడంటే..
‘‘భారత్ ఎప్పుడూ హింస, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. సల్మాన్ రష్దీపై జరిగిన భయంకరమైన దాడిని మేము ఖండిస్తున్నాము. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము ’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆగస్టులో మీడియా సమావేశంలో అన్నారు.
1989లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ తన నవల ‘ది సాటానిక్ వెర్సెస్’ ప్రచురితం అయిన తరువాత ఆయన మరణానికి పిలుపునిస్తూ ‘ఫత్వా’ జారీ చేసిన తర్వాత రష్దీ చాలా సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపాడు. రష్దీ 1947లో ముంబైలో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే ముందు ఇంగ్లండ్‌లోని బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లారు. 2007లో సాహిత్యానికి చేసిన సేవలకు గాను అతనికి నైట్ బిరుదు లభించింది.
రైలు నుంచి జారిపడి.. కదులుతున్న రైలుకు ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కున్న మహిళ..
ఆయనకు చాలా కాలం నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆయన చాలా ఏళ్ల నుంచి భయాందోళన మధ్య జీవనం గడుపుతూనే ఉన్నారు. ఆయనపై ఇప్పటి వరకు 15 సార్లు కత్తులతో దాడి జరిగింది. దీనికి ఆయన రచించిన ఓ పుస్తకమే కారణం. 1988 లో సల్మా న్ రష్దీ ‘ది సాటానిక్ వెర్సె స్ (the satanic verses)’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం తీవ్ర వివాదాలకు దారి తీసింది. ఈ పుస్తకతం ఇస్లామిక్ వ్యతిరేక, దైవ దూషణగా పరిగణలోకి వచ్చింది. దీంతో అతడికి ఇరాన్ నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. ఆ పుస్తకాన్ని 1988 సంవత్సరంలో ఇరాన్ నిషేధించింది. అప్పటి నుంచి రష్దీ తీవ్రవాదులకు టార్గెట్ గా ఉన్నారు.
