Asianet News TeluguAsianet News Telugu

 రైలు నుంచి జారిపడి.. కదులుతున్న రైలుకు ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. 

రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ పట్టుకోల్పోయి.. కాలు జారింది. దీంతో ఆ మహిళ ప్లాట్‌ఫారమ్ కు, కదులుతున్న రైలు కిందకు  మధ్య జారిపడింది. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగింది. 

Woman Falls Into Gap Between Moving Train And Platform In Bihar
Author
First Published Oct 24, 2022, 5:53 AM IST

మన దేశ రవాణా వ్యవస్థలో రైల్వేలు చాలా ప్రముఖ పాత్ర రోల్ పోషిస్తున్నాయి. తక్కువ వ్యయంతో సుదూర ప్రాంతాలకు వెళ్లవచ్చు.  అందుకే .. ఎంత కష్టమైనా..  సామన్యులు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే రైలు నడుస్తున్నడు.. అందులో నుంచి దిగే ప్రయత్నం గానీ, ఎక్కే ప్రయత్నం గానీ అసలు చేయకూడదు. ఈ మధ్య రైల్యే స్టేషన్లలో ప్రమాదాలు జరగడం చూస్తున్నాం.. స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో రైలు స్పీడ్ తగ్గుతుంది. ఈ  సమయంలో కొందరు రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దిగుతుంటారు. మరికొందరూ రైళ్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో  కొన్ని సార్లు ప్రమాదాలకూ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైలు పూర్తిగా ఆగిన తర్వాతనే అందులోకి ఎక్కడం గానీ, అందులో నుంచి దికడం గానీ చేయాలి.

కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతునే ఉన్నాయి. అయినా.. కొంత మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా..నిర్లక్ష్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్టో తెగ వైరల్ అవుతోంది.  

బీహార్‌లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక భయంకర సంఘటన జరిగింది. రైలు ఎక్కే క్రమంలో ఓ మహిళ పట్టుకోల్పోయి.. కాలు జారింది. దీంతో ఆ మహిళ ప్లాట్‌ఫారమ్ కు, కదులుతున్న రైలు కిందకు  మధ్య జారిపడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారి క్షణాల్లో అప్రమత్తమై.. ఆ మహిళను బయటకు లాగాడు.  ఈ సమయంలో అక్కడ జనం గుమిగూడారు. దీని వీడియోను RPF తన ట్విట్టర్ హ్యాండిల్‌తో షేర్ చేసింది.

ఆర్‌పిఎఫ్ అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ మహిళ గాయపడిన ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన మొత్తం రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఒక మహిళ కదులుతున్న రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె జారిపడి రైలు అంచు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇది చూసి అక్కడికక్కడే ఉన్న ఆర్పీఎఫ్ అధికారి పరుగులు తీశారు. వెంటనే వచ్చి ఆమెను బయటకు లాగడం చూడవచ్చు. మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios