ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ వివాదం అన్న ఇమ్రాన్ ఖాన్ తమను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. 

జమ్ముకశ్మీర్ పై భారత్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంట్‌లో రగడ చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరయ్యారు.  

ప్రధాని గైర్హాజరుపై ప్రతిపక్ష పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దీంతో పాక్ పార్లమెంట్ లో రభస చోటు చేసుకుంది. విపక్షాల నినాదాలతో పార్లమెంట్ మార్మోగిపోయింది. 

విపక్షాలను స్పీకర్ ఎంత వారించినా మార్పు రాకపోవడంతో స్పీకర్ తన ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. దాంతో అర్థాంతరంగా పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశాలు మధ్యలో నిలిచిపోయినట్లు అయ్యింది.  

ఇకపోతే జమ్ముకశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయం ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాకిస్తాన్ విమర్శనాస్త్రాలు సంధించింది. పాకిస్థాన్ విమర్శలపై ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వయంగా ఫోన్‌లో మాట్లాడినా కూడా వారి నుంచి స్పందన కరువైంది. అటు పాకిస్థాన్ కు మిత్రదేశమైన చైనా సైతం జమ్ముకశ్మీర్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండా తటస్థంగా ఉండిపోయింది. ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు: విషం కక్కిన పాక్ మీడియా

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

ఆర్టికల్ 370 రద్దు చేస్తారా, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా