న్యూఢిల్లీ: ఆర్టికల్ 370  రద్దు, జమ్మూ కాశ్మీర్ ను విభజిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై పాకిస్తాన్ మీడియా కూడ విషం కక్కింది. కాశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భారత్ వైఫల్యం చెందిందని  ఆదేశ మీడియా ఆరోపణలు గుప్పించింది.

సోమవారం నాడు కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్గించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసింది. ఈ పరిణామాలపై  పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ తీసుకొన్న నిర్ణయాలు అవగాహనరాహిత్యంగా ఆ పత్రిక అభిప్రాయపడింది.

ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా  కాశ్మీర్ ప్రజలు స్వయంప్రతిపత్తిని కోల్పోయారని ఆ పత్రిక విమర్శించింది. ఈ ఆర్టికల్ రద్దు ద్వారా ప్రజల్ని మోసం చేశారని ఆ పత్రిక అభిప్రాయపడింది.

మరో పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కూడ కాశ్మీర్ చరిత్రలో ఇది చీకటి రోజు అంటూ కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ టుడే అనే మరో పత్రిక భారత్ మోసం చేసిందని కథనాలను ప్రచురించింది. మరికొన్ని వార్తా పత్రికలు కూడ కాశ్మీర్ విషయంలో భారత్ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  కథనాలను ప్రచురించాయి. 

సంబంధిత వార్తలు

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

ఆర్టికల్ 370 రద్దు చేస్తారా, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా