భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. లష్కర్, జైష్ స్థావరాలు ధ్వంసం. ఉగ్ర స్థావరాలపై రాఫెల్ యుద్ధ విమానాలతో దాడి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. "ఆపరేషన్ సింధూర్" పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
ఆపరేషన్ ముఖ్యాంశాలు:
త్రివిధ దళాల సహకారం:
భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళం కలిసి సమన్వయంగా ఆపరేషన్ ను నిర్వహించాయి.
ఉన్నత స్థాయి ఆయుధాల వినియోగం:
రాఫెల్ యుద్ధ విమానాలు, డ్రోన్ల ద్వారా లక్ష్యాలను కచ్చితంగా కొట్టారు.
నేరుగా ప్రధాని పర్యవేక్షణ
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.9 ఉగ్ర స్థావరాలపై దాడి విజయవంతం:
మురీద్‌కేలో లష్కర్ స్థావరం ధ్వంసం,బహవల్పూర్ లో జైష్ స్థావరం ధ్వంసంఅంతర్జాతీయ సమాచారం: అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా వంటి దేశాలకు భారత్ ముందుగానే సమాచారం అందించింది.
కుటుంబ రాజకీయ చర్చలు: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు.
పాక్ నిరసన: పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
విమాన సర్వీసులపై ప్రభావం: శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలలో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అంధకారంలో పాక్: భారత్ విరుచుకుపడిన తరువాత పాక్ ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది.దీంతో ప్రస్తుతం పాక్ ప్రజలంతా అంధకారంలో ఉన్నారు.


