Asianet News TeluguAsianet News Telugu

‘అంతటి అజ్ఞానాన్ని ఎప్పుడూ వినలేదు’.. అమెరికాపై విరుచుకుపడ్డ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...

గత నెలలో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్న తరువాత మొదటిసారి ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఖాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వానికి తాలిబన్లతో కలిసి పనిచేయడమే ఉత్తమం అన్నారు. మహిళల హక్కులు, మిగతా సమస్యల మీద ప్రభుత్వంతో కలుపుకుని పోవాలని అన్నారు. 

Never Heard Such Ignorance : Imran Khan On Antony Blinken's Pak Remarks
Author
Hyderabad, First Published Sep 16, 2021, 11:57 AM IST

ఇస్లామాబాద్ : ఆఫ్గనిస్తాన్ ను ఖైవసం చేసుకున్న తాలిబాన్‌ల మీద ఏకాభిప్రాయాన్ని సాధించడానికి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్  ప్రయత్నిస్తున్నారు, ఈ ప్రయత్నం ఆఫ్ఘనిస్తాన్‌లో "ఇస్లామిక్ ఎమిరేట్" కొత్త సంరక్షక ప్రభుత్వాన్ని గుర్తించడానికి దారితీస్తుంది.

గత నెలలో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్న తరువాత మొదటిసారి ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఖాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వానికి తాలిబన్లతో కలిసి పనిచేయడమే ఉత్తమం అన్నారు. మహిళల హక్కులు, మిగతా సమస్యల మీద ప్రభుత్వంతో కలుపుకుని పోవాలని అన్నారు. 

"తాలిబాన్లు మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ ను ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వారు అందరినీ కలుపుకొని ప్రభుత్వం పని చేయగలిగితే, 40 సంవత్సరాల తరువాత ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి ఏర్పడుతుంది. అయితే ఒకవేళ ఇది తప్పు అయితే, నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. గందరగోళం సృష్టిస్తుంది. అంతేకాదు అది అతిపెద్ద మానవతా సంక్షోభానికి, భారీ శరణార్థుల సమస్యగా మారుతుంది"అని ఖాన్ అన్నారు.

‘ఆఫ్గాన్ మహిళలకు తమ హక్కులు బైటివారు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు చాలా గట్టివారు. తమ హక్కులను తాము సాధించుకోగలరు’ అని ఖాన్ అన్నారు. జీవితంలో తమకు కావాల్సినవి సాధించుకోవాల్సిన సామర్థ్యాన్ని మహిళలు కలిగి ఉండాలని కూడా ఆయన అన్నారు.  

చైనాలో మళ్లీ లాక్ డౌన్... కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో..!

అధికారంలోకి వచ్చీ రాగానే తాలిబన్లు.. తమ మీద అంతకుముందున్న అభిప్రాయాల్ని చెరిపేలా వాగ్దానాలు చేశారు.. మానవ హక్కులను కాపాడతామని, మహిళలు, బాలికలకు అనుకూలంగా ఉంటామని, జర్నలిస్టులను వారిపని వారిని చేసుకోనిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇవేవీ నెరవేరలేదు. తాలిబన్లు మహిళల మీద ఉక్కుపాదం మోపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాఉద్యోగాల్లోనూ ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

దీంతోపాటు తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా , పౌర హక్కుల కోసం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా అణచివేయబడ్డాయి. జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీవ్రంగా హింసించారు. అంతేకాదు విశ్వవిద్యాలయాల్లోని క్లాస్ రూంలలో పురుషులు, స్త్రీలకు మధ్య పరదాను ఏర్పాటు చేయాలని ఆదేశించార. తప్పనిసరిగా షరియా చట్టం ప్రకారం మహిళా విద్యార్థులు, లెక్చరర్లు, ఉద్యోగులు తప్పనిసరిగా హిజాబ్‌లు ధరించాలని చెప్పారు. 

సమాన హక్కులు కోరుతూ దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చిన మహిళా నిరసనకారులపై తాలిబాన్లు కొరడాలు, కర్రలతో దాడి చేశారు. అయితే, ప్రపంచం మానవ హక్కులపై తాలిబాన్లకు '' సమయం '' ఇవ్వాలని ఖాన్ అన్నారు. కానీ సహాయం లేకుండా '' గందరగోళానికి '' భయపడుతుందని సిఎన్ఎన్ నివేదించింది.

ఒక సంక్షోభాన్ని నివారించడానికి తాలిబాన్లు అంతర్జాతీయ సాయం కోసం చూస్తున్నారని ఖాన్ పేర్కొన్నారు. ఇది గ్రూప్ ను "చట్టబద్ధత వైపు సరైన దిశలో" పనిచేయడానికి సాయం చేస్తుందన్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్‌ను బయటి శక్తులు నియంత్రించలేవని కూడా ఆయన హెచ్చరించారు.

"ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ తోలుబొమ్మ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు" అని ఆయన అన్నారు. "కాబట్టి ఇక్కడ కూర్చొని మనం వారిని నియంత్రించవచ్చని ఆలోచించే బదులు, మనం వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్, ప్రస్తుత ప్రభుత్వం, అంతర్జాతీయ సహాయం లేకుండా ఈ సంక్షోభాన్ని ఆపలేరని స్పష్టంగా భావిస్తున్నారు. కాబట్టి మనం వారిని సరైన దిశలో వెళ్లేలా చూడాలి " అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ... పాకిస్తాన్ కు అమెరికాతో ఉన్న భయంకరమైన సంబంధం గురించి కూడా మాట్లాడారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ కొత్త నాయకులతో వ్యవహరించే విషయంలో మరింత ఆచరణాత్మక విధానాన్ని ఎలా కోరుకుంటున్నారో కూడా ఖాన్ చెప్పుకొచ్చారు. ఖాన్ మాట్లాడుతూ "మేము (పాకిస్తాన్) కిరాయి తుపాకీ లాంటిది" అని ఖాన్ అన్నారు. "మేం ఎన్నడూ చేయలేని ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో వారిని (యుఎస్) గెలిపించాలని మేం అనుకున్నాం."

అమెరికా తన లక్ష్యాలను సైనికపరంగా సాధించలేదని, అక్కడే చిక్కుకుపోతుందని తాను అమెరికా అధికారులను పదేపదే హెచ్చరించానని ఖాన్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉనికిలో ఉన్న సమయంలోనే తాలిబన్‌లతో "రాజకీయ బలం" నుండి రాజకీయ సెటిల్‌మెంట్‌కు అమెరికా ప్రయత్నించి ఉండాలని ఆయన అన్నారు.

ఖాన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా నిష్క్రమణను విమర్శించారు. పాకిస్తాన్ నాటోయేతర మిత్రదేశంగా ఉన్నప్పటికీ, తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అధ్యక్షుడు జో బిడెన్‌తో మాట్లాడలేదని చెప్పారు. "అతను చాలా బిజీగా ఉంటాడని ఊహించగలను, కానీ యుఎస్‌తో మా సంబంధం కేవలం ఫోన్ కాల్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు, అది బహుమితీయ సంబంధంగా ఉండాలి" అని ఖాన్ అన్నారు.

సోమవారం, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, అమెరికా ఉపసంహరణ తరువాత పాకిస్తాన్‌తో తన సంబంధాలను తిరిగి అంచనా వేస్తుందని చెప్పారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ విచారణ సందర్భంగా అతను కాంగ్రెస్‌తో మాట్లాడుతూ, పాకిస్తాన్ "మనతో విభేదించే కొన్ని మల్టిపుల్ ఆఫ్ ఇంట్రెస్టులను" కలిగి ఉందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఖాన్  "అజ్ఞానం" అని, అలాంటి అజ్ఞానాన్ని నేను ఎన్నడూ చూడలేదు.. అని అన్నారు.  

‘అమెరికాపై అల్ ఖైదా మరోసారి దాడి చేయవచ్చు.. అఫ్ఘాన్‌లో బలపడానికి ప్రయత్నాలు చేస్తున్నది’

అమెరికాకు మద్దతు ఇవ్వడం వల్ల అనేక మిలిటెంట్ గ్రూపుల.. ఉగ్రవాదుల దాడుల్లో వేలాది మంది పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోయారు. మేం యుఎస్‌తో కలిసి ఉన్నందున,  9/11, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం తర్వాత యుఎస్‌కు మిత్రులం అయ్యాం. ఒకానొక సమయంలో ఎంతో బాధను అనుభవించింది. 50 మంది మిలిటెంట్ గ్రూపులు మా ప్రభుత్వంపై దాడి చేశాయి. అంతేకాదు, పాకిస్తాన్‌లో అమెరికా 480 డ్రోన్ దాడులు కూడా జరిగాయి.. అన్నారు. 

మిత్రదేశంతోనే దాడి చేయబడిన ఏకైక దేశం మాదే.. అంటూ US దాడుల గురించి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, వారికి సురక్షితమైన స్వర్గధామం కల్పించిందని అమెరికా పదేపదే ఆరోపిస్తోందని.. వీటిని ఖాన్ ఖండించారు.

"ఈ సురక్షిత స్వర్గధామాలు ఏమిటి?" ఖాన్ అడిగారు. "ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న పాకిస్తాన్ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ డ్రోన్‌లతో అత్యంత భారీ నిఘా పెట్టింది. దీని ద్వారా అలాంటి సురక్షితమైన స్వర్గధామాలు ఉన్నాయో లేదో వారికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా?" అన్నారు. అంతేకాదు వేరొకరి యుద్ధం కోసం తన దేశాన్ని నాశనం చేయలేనని ఖాన్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios