Asianet News TeluguAsianet News Telugu

చైనాలో మళ్లీ లాక్ డౌన్... కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో..!

కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

Lockdown in China Again
Author
Hyderabad, First Published Sep 16, 2021, 9:44 AM IST

కరోనా మహమ్మారికి పుట్టిల్లు అయిన చైనాలో ఈ వైరస్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో.. అక్కడ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. నగరాల్లో అధిక సంఖ్యలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిపేందుకు బుధవారం ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

 ఫుజియాన్ ప్రావిన్స్ లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

జియోమెన్, క్వాన్ జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. 2019 ఆఖరులో కరోనా వైరస్ తొలుత చైనాలోని వుహాన్ లోనే బయటపడిన సంగతి తెలిసిందే.

అనంతరం కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన  చైనా ప్రస్తుతం కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తుంది. ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు బయటపడగా.. అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అత్యధిక సాంక్రమిక శక్తి కలిగిన డెల్టా రకంతోపాటు.. మరికొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటంతో చైనా మరిన్ని చర్యలు చేపట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios