OpenAI New CEO Mira Murati : ఓపెన్ ఏఐ కొత్త తాత్కాలిక సీఈఓగా మీరా మురాటి.. ఇంతకీ ఆమె ఎవరంటే?
Mira Murati : ఓపెన్ఏఐ సీఈవోగా ఉన్న సామ్ ఆల్ట్ మన్ ను ఆ సంస్థ బాధ్యతలను నుంచి తప్పించింది. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈవోగా మీరా మురాటికి బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం ఆమె అదే సంస్థలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.
Mira Murati : ఓపెన్ఏఐ తాత్కాలిక సీఈఓగా మీరా మురాటి నియమితులయ్యారు. సామ్ ఆల్ట్ మన్ ను నాటకీయంగా తొలగించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆల్ట్ మన్ ఆకస్మిక నిష్క్రమణ గురించి తెలిజేయస్తూ విడుదలైన ప్రకటనలోనే మీరా మురాటి నిమాయకంపై ఆ సంస్థ స్పష్టతను ఇచ్చింది.
బోర్డుతో సీఈఓ శామ్ ఆల్ట్ మన్ జరిపిన సంభాషణల్లో నిలకడగా వ్యవహరించలేదని సమీక్షలో తేలిందని, దీంతో ఆయనను పదవి నుంచి తొలగించినట్లు ఓపెన్ ఏఐ బోర్డు తెలిపింది. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు నమ్మకం లేదని ఆకంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. మీరా మురాటి గత కొంత కాలంగా కంపెనీ సి-సూట్ లో భాగంగా ఉన్నారు. దీంతో ఓపెన్ ఏఐలో కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయని ఆ బోర్డు భావిస్తోంది.
ఇంతకీ ఎవరీ మీరా మురాటి ?
34 ఏళ్ల మీరా మురాటి గతంలో ఓపెన్ఏఐకి సీటీవో గా పని చేశారు. చాట్ జీపీటీ, డీఏఎల్-ఈ వంటి ఓపెన్ ఏఐ విప్లవాత్మక ఉత్పత్తుల అభివృద్ధి వెనుక ఆమె కీలక పాత్ర పోషించారు. మురాటి అల్బేనియాలో అల్బేనియన్ తల్లిదండ్రులకు ఆమె జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో పియర్సన్ కాలేజ్ యూడబ్ల్యూసీలో చేరేందుకు కెనడాకు వెళ్లారు.
ప్రపంచ కప్ 2023 : కప్పుకొట్టడం కాదు, బంతిని పిచ్చకొట్టుడు కొట్టండి.. టీమిండియాకు సద్గురు సలహా..
అమెరికాలోని ఐవీ లీగ్ డార్ట్ మౌత్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. అండర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న రోజుల్లో, ఆమె తన సీనియర్ ప్రాజెక్ట్ కోసం హైబ్రిడ్ రేస్ కారును నిర్మించారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గోల్డ్ మన్ శాక్స్ లో ఇంటర్న్ గా, ఆ తర్వాత జోడియాక్ ఏరోస్పేస్ లో ఇంటర్న్ గా ఆమె తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత టెస్లాలో మూడేళ్లు మోడల్ ఎక్స్ లో పనిచేశారు.
టెక్ క్రంచ్ ప్రకారం.. మురాటి 2016 లో సెన్సార్ బిల్డింగ్ స్టార్టప్ లీప్ మోషన్ లో ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విపిగా చేరారు. రెండేళ్ల తర్వాత లీప్ మోషన్ నుంచి వైదొలిగిన ఆమె అప్లైడ్ ఏఐ, భాగస్వామ్యాల వీపీగా ఓపెన్ ఏఐలో చేరారు. 2018లో ఓపెన్ఏఐ సంస్థలో చేరిన మురాటి.. సూపర్ కంప్యూటర్ పై పనిచేయడం ప్రారంభించారు. 2022లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందారు. అయితే తాజాగా ఆమె తాత్కాలిక సీఈఓగా పదోన్నతి పొందారు.
Fact Check: వ్యాపారి భార్యపై గ్యాంగ్ రేప్ జరిగిందా? అది లవర్ అప్పు తీర్చుకోవడానికి ఆమె వేసిన స్కెచ్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆమె గురించి మాట్లాడుతూ.. మురాటికి సాంకేతిక నైపుణ్యం, వాణిజ్య చతురత, మిషన్ ప్రాముఖ్యతపై లోతైన ప్రశంసతో బృందాలను సమీకరించే సామర్థ్యం ఉందని తెలిపారు. మీరా మేము చూసిన అత్యంత ఉత్తేజకరమైన ఏఐ టెక్నాలజీలను రూపొందించడంలో సహాయపడ్డారని పేర్కొన్నారు.